Begin typing your search above and press return to search.
థియేటర్లకు రాలేదు.. ఫ్రీగా అయినా చూడండి
By: Tupaki Desk | 16 Sep 2017 11:53 AM GMTదిల్ రాజు గత ఏడాది నుంచి ఓ చిన్న సినిమా గురించి గొప్పగా చెబుతున్నాడు. అదే.. వెళ్లిపోమాకే. అందరూ కొత్త వాళ్లు కలిసి చాలా తక్కువ బడ్జెట్లో తెరకెక్కించిన సినిమా చూసి నచ్చేసి.. దానికి పేరు కూడా మార్చి తన బేనర్లో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చాడు. ఐతే గత ఏడాది చివర్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడి.. ఈ నెల రెండో తారీఖున థియటర్లలోకి వచ్చింది. విడుదలకు ముందే ఫ్రీ ప్రివ్యూలు వేసినా.. ఈ చిన్న సినిమాకు మద్దతుగా నిలవండంటూ దిల్ రాజు పిలుపు ఇచ్చినా ఫలితం లేకపోయింది.
‘వెళ్లిపోమాకే’ విడుదలైన సంగతే జనాలకు తెలియని పరిస్థితి నెలకొంది. ఐతే థియేటర్లకు రాకపోతే రాకపోయారు.. కనీసం ఉచితంగా ఆన్ లైన్లో అయినా చూడండంటూ ఈ చిత్ర బృందం పిలుపునిస్తోంది. ‘వెళ్లిపోమాకే’ సినిమాను ఇంతలోనే యూట్యూబ్ లో పెట్టేశారు. దిల్ రాజు సహా కొందరు ఈ సినిమా గురించి చెప్పిన మాటలు విని.. సినిమా చూడాలని ఆశించినా.. దీనికి చాలా పరిమితంగా థియేటర్లివ్వడం వల్ల అందుబాటులో లేకుండా పోయింది. కాబట్టి అలాంటి వాళ్లంతా ఫ్రీగా ఇప్పుడు యూట్యూబ్ లో సినిమా చూడొచ్చు. యాకూబ్ అలీ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో విశ్వక్సేన్ అనే కొత్త హీరో నటించాడు. అతడి పక్కన నటించిన ఇద్దరమ్మాయిలు కూడా కొత్త వాళ్లే. మరి యూట్యూబ్ లో అయినా ఈ చిత్రానికి ఆదరణ దక్కుతుందేమో చూద్దాం.