Begin typing your search above and press return to search.

మీడియాను పిలిచి పెళ్లి చేసుకున్నాడు

By:  Tupaki Desk   |   4 Jun 2017 6:19 AM GMT
మీడియాను పిలిచి పెళ్లి చేసుకున్నాడు
X
ఆ దర్శకుడు వయసు 60 ఏళ్లు.. ఆ అమ్మాయి వయసు 30 ఏళ్లు.. ఇద్దరూ కలిసి రెండు మూడు సినిమాలు చేశారు. వాళ్లిద్దరికీ పదేళ్లకు పైగా స్నేహం ఉంది. వాళ్లిద్దరి బంధం గురించి మీడియాలో రకరకాల వార్తలొచ్చాయి. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారేమో అన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. కాకపోతే వయసు తేడా రీత్యా ఆ పని చేస్తారా అని సందేహించారు. ఐతే ఆ దర్శకుడు తన కొత్త సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ కోసం మీడియాను పిలిచి.. ఎవ్వరూ ఊహించని విధంగా వారి ముందే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మీడియా వాళ్లకు దిమ్మదిరిగే షాకిచ్చాడు. తమిళ దర్శకుడు వేలు ప్రభాకరన్.. ఆయన దర్శకత్వంలో ‘కాదల్ కథై’ అనే సినిమా చేసిన షిర్లీ దాస్ పెళ్లి చేసుకున్న తీరిది.

వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వేలు ప్రభాకరన్.. తాజాగా ‘ఒరు ఇయక్కునరిన్ కాదల్ డైరీ’ అనే సినిమా తీశాడు. ఒక ఫిలిం మేకర్.. ఒక హీరోయిన్ మధ్య సాగే బంధం నేపథ్యంలో సాగే కథ ఇది. ఇది వేలు-షిర్లీల కథే అని మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ విషయాన్నే ధ్రువీకరిస్తూ మీడియా వాళ్ల ముందే పెళ్లి చేసుకున్నాడు వేలు ప్రభాకరన్. సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ అని పిలిచి సింపుల్ గా రింగులు మార్చుకుని తమ పెళ్లి అయిపోయిందని వేలు-షిర్లీ జంట చెప్పేసరికి షాకవడం మీడియా వాళ్ల వంతైంది. త్వరలోనే తమ పెళ్లిని రిజిస్టర్ చేయించనున్నట్లు వేలు తెలిపాడు. షిర్లీ తన మనసుకు బాగా దగ్గరైందని.. కొన్నేళ్లుగా తాము రిలేషన్ షిప్ లో ఉన్నామని ఆయన చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/