Begin typing your search above and press return to search.
అప్పుడు ట్రెండ్ సెట్ చేశారు.. మరి ఇప్పుడు
By: Tupaki Desk | 12 Oct 2016 9:35 AM GMTతమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. దాదాపుగా అతడి ప్రతి సినిమా తెలుగులోకి డబ్ అయింది. తొమ్మిదేళ్ల కిందట వెంకట్ ప్రభు దర్శకుడిగా మారి తీసిన తొలి సినిమా ‘చెన్నై 600028’ అప్పట్లో సెన్సేషనల్ హిట్టయింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆ మధ్య వెంకట్ ప్రభు తీసిన ‘రాక్షసుడు’ ఆడియో వేడుకకు వచ్చిన ప్రభాస్ సైతం ఈ సినిమా గురించి చెప్పి గొప్పగా పొగిడాడు. ఈ చిత్రం ‘కొడితే కొట్టాలిరా’ పేరుతో తెలుగులోకి కూడా అనువాదమవుతుంది. గల్లీ క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమా భలేగా ఉంటుంది. ఆ సినిమాతో తమిళనాడును ఓ ఊపు ఊపేసిన వెంకట్ ప్రభు.. తర్వాత దర్శకుడిగా ఇంంతింతై అన్నట్లు ఎదిగాడు. అజిత్.. సూర్య లాంటి హీరోలతో సినిమాలు చేశాడు.
‘రాక్షసుడు’ తర్వాత వెంకట్ ప్రభు తన తొలి సినిమా సీక్వెల్ కు శ్రీకారం చుట్టాడు. తొమ్మిదేళ్ల కిందట నటించిన అదే నటీనటులతో వెంకట్ ఈ సినిమా తీయడం విశేషం. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజైంది. క్రికెట్ ఆడుతూ అల్లరి చిల్లరగా ఉన్న కుర్రాళ్లంతా.. పెళ్లి తర్వాత ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ అయిపోతారు. వాళ్ల భార్యలు వీళ్లను స్నేహితులతో కలవడానికి ఇష్టపడరు. ఇలాంటి టైంలో ఒక స్నేహితుడి కోసం మళ్లీ ఈ టీమ్ అంతా ఒక్కటవుతుంది. క్రికెట్ మ్యాచ్ కు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో సాగే కథ ఇది. దీన్ని తెలుగులోకి కూడా అనువదించి రిలీజ్ చేయబోతున్నారు. మరి అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన ‘చెన్నై-28’ బాయ్స్.. ఈసారి ఎలాంటి రిజల్ట్ రాబడతారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/