Begin typing your search above and press return to search.
నటీనటుల బాటిల్స్ తో పార్టీ.. భళా
By: Tupaki Desk | 24 Jun 2017 5:51 AM GMTతమిళ నాట దర్శకుడు వెంకట్ ప్రభుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గత పదేళ్లలో ఏడు సినిమాలు మాత్రమే తీసినా.. దర్శకుడిగా టాప్ డైరెక్టర్ల జాబితాలో చోటు సంపాదించేశాడు. తీసిన ప్రతీ సినిమాతో సక్సెస్ కొట్టేస్తూ.. తన జర్నీని కంటిన్యూ చేస్తున్న వెంకట్ ప్రభు.. తన కొత్త సినిమా ను విభిన్నంగా అనౌన్స్ చేశాడు.
క్రియేటివిటీకి హద్దు ఉండదనే సంగతి చెప్పాల్సిన పని లేదు. తన సినిమాలలో ఇలాంటి క్రియేటివిటీని పీక్ స్టేజ్ కి తీసుకెళుతూ ఉంటాడు దర్శకుడు వెంకట్ ప్రభు. గతేడాది చెన్నై600028-2: సెకండ్ ఇన్నింగ్స్ చిత్రాన్ని తీసిన వెంకట్ ప్రభు.. కొత్త సినిమా తీయబోతున్నారు. పార్టీ అంటూ ఈ చిత్రానికి నామకరణం చేయగా.. తన టీం అనౌన్స్ మెంట్ కోసం ఈయన ఎంచుకున్న విధానం అందరికీ షాక్ ఇచ్చేసింది. పార్టీ.. హాంగోవర్ అంటూ.. వరుసగా అనేక రకాల లిక్కర్ బాటిల్స్ ను ఉంచి.. ఒక్కో బాటిల్ కి ఒక్కో కీలక పాత్రధారుల పేర్లు తగిలించాడు దర్శకుడు.
సత్యరాజ్.. జయరాం.. నాజర్.. సంపత్.. జై.. శివ.. చంద్రన్.. రమ్యకృష్ణ.. రెజీనా కసాండ్రా.. సంచితా శెట్టి.. నిదేవలు నటిస్తుండగా.. వీరందరి పేర్లను బాటిల్స్ పై.. ఆయా ఒరిజినల్ డిజైన్స్ కు దగ్గరగా రాయించాలనే ఆలోచన ఆకట్టుకుంటోంది. యాక్టర్స్ ను అనౌన్స్ చేయడానికే ఇంత వైవిధ్యత చూపిస్తే.. ఇక సినిమా మరెంత విభిన్నంగా ఉంటుందో అనుకుంటున్నారు జనాలు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/