Begin typing your search above and press return to search.
పవర్ స్టార్-సూపర్ స్టార్ కుదిరే పనేనా?
By: Tupaki Desk | 13 Nov 2018 10:41 AM GMTటాలీవుడ్ లో పవర్ స్టార్ - సూపర్ స్టార్ కాంబినేషన్ కుదిరేపనేనా? అంటే కుదిరితే బావుండుననేది అభిమానుల ఆకాంక్ష. కానీ అది ఇప్పట్లో నెరవేరుతుందా.. అంటే ఆ అవకాశం కనిపించడం లేదు. ఓ దర్శకుడు మాత్రం కచ్ఛితంగా ఆ ఇద్దరినీ కలిపి తీరతానని ఆశాభావం వ్యక్తం చేయడం టాలీవుడ్ లో చర్చకొచ్చింది. ఇంతకీ ఎవరాయన? అంటే తళా అజిత్ `గ్యాంబ్లర్` డైరెక్టర్ .. ఇళయరాజా తమ్ముడి కొడుకు.. సీనియర్ దర్శకుడు వెంకట్ ప్రభు తాను సాధ్యం చేసి చూపిస్తానని అంటున్నాడు. అదెలా సాధ్యం? అంటే తనవద్ద ఉన్న స్క్రిప్టు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని - సూపర్ స్టార్ మహేష్ ని కలుపుతుందని అన్నాడు. ఆ ఇద్దరినీ కలవలేదు. సినిమా చేయమని అడగలేదు. కానీ తనకు నమ్మకం ఉందని అన్నారు. ఆ ఇద్దరికీ సరిపడే స్క్రిప్టు తనవద్ద ఉందని కలిసి వినిపించే ప్రయత్నం చేస్తానని అన్నాడు.
వాళ్లు అంగీకరిస్తారా..? అంటే అలాంటి ఛాన్స్ రావాలనే ఆశిస్తున్నానని అన్నాడు. ఇంతకీ ఏ సందర్భంలో అతడు ఈ మాట అన్నాడు అంటే .. వెంకట్ ప్రభు తెరకెక్కించిన `పార్టీ` త్వరలో తెలుగు - తమిళంలో సైమల్టేనియస్ గా రిలీజ్ కి వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగిన ఈవెంట్ లో మీడియాకి ప్రమోషనల్ ట్రైలర్ పాటల్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా హోస్ట్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా వెంకట్ ప్రభు ఆసక్తికరమైన సంగతిని రివీల్ చేశారు. `పార్టీ` మూవీ ఈవెంట్ లో దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ తన రియల్ టైమ్ డ్రీమ్ ని బయటపెట్టారు.
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ - ఎన్టీఆర్ లతో ఆర్.ఆర్.ఆర్ తీస్తున్నారు.. మీకు అలాంటి మల్టీస్టారర్ చేసే అవకాశం వస్తే టాలీవుడ్ లో చేస్తారా? అని ప్రశ్నిస్తే..ఆయన వెంటనే తడుముకోకుండా సమాధానం ఇచ్చారు. అజిత్ - విజయ్ కోసం కథ రాసుకున్నాను. ఆ కథను తెలుగులో తీయాల్సి వస్తే పవన్-మహేష్ లతో తెరకెక్కిస్తానని వెంకట్ ప్రభు అన్నారు. అయితే ఆ ఇద్దరినీ కలిసి కథ చెప్పాల్సి ఉంటుందని అన్నాడు. సరోజ - గ్యాంబ్లర్ లాంటి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన వెంకట్ ప్రభు డ్రీమ్ బాగానే ఉన్నా.. ఆ ఇద్దరినీ ఒప్పించడం అన్నదే పెద్ద టాస్క్. పైగా పవన్ పూర్తిగా రాజకీయాల్లో బిజీ. మహేష్ వరుస కమిట్ మెంట్స్ తో మరో ఐదేళ్ల పాటు ఎవరికీ దొరకనంత బిజీ. ఇలాంటి వేళ వెంకట్ ప్రభు ఆశ నెరవేరే ఛాన్సుందంటారా?