Begin typing your search above and press return to search.

ఉగాదికి రిస్క్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   17 March 2017 11:09 PM IST
ఉగాదికి రిస్క్ చేస్తున్నారా?
X
వచ్చే వారం నుంచి టాలీవుడ్ కి సమ్మర్ సీజన్ మొదలవుతోంది. పవర్ స్టార్ నటించిన కాటమరాయుడుతో మొదలు కానున్న హంగామా.. మీడియం.. భారీ బడ్జెట్ చిత్రాలతో నిండిపోయింది. ముందు వెనుకా అన్నీ పెద్ద సినిమాలు.. క్రేజీ ప్రాజెక్టులు ఉండడంతో.. చిన్న సినిమా నిర్మాతలెవరూ తమ మూవీస్ ని షెడ్యూల్ చేసేందుకు సాహసించడం లేదు.

కానీ వెంకటాపురం చిత్రాన్ని ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు నిర్మాతలు శ్రేయాస్ శ్రీను.. ఫణి కుమార్. హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ కి జోడీగా మహిమ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా.. ఓ యువతి హత్య నేపథ్యంతో ఈ కథ సాగనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని.. 10 లక్షలకు పైగా వ్యూస్ లభించాయని ఈ మూవీ తో దర్శకుడిగా పరిచయం అవుతున్న వేణు చెబుతున్నాడు. కాటమరాయుడు చిత్రం రిలీజ్ అయిన 5 రోజులకే వెంకటాపురం రిలీజ్ చేయాలని నిర్ణయించడం ఆసక్తి కలిగిస్తోంది.

మరోవైపు ఆ తర్వాతి వారంలో కూడా పెద్ద సినిమాలే షెడ్యూల్ చేసి ఉన్నాయి. వెంకటేష్ నటించిన గురు.. మణిరత్నం మూవీ చెలియా.. మోహన్ లాల్-అల్లు శిరీష్ లు నటించిన 1971-భారత సరిహద్దు విడుదల కానున్నాయి. ఇలాంటి టైంలో టాక్ ఏ మాత్రం తేడా ఉన్నా.. అసలుకే ఎసరు వస్తుంది. అయినా సరే వెంకటాపురంను ధైర్యంగా రిలీజ్ చేస్తున్నారంటే.. మూవీపై యూనిట్ కు ఉన్న కాన్ఫిడెన్స్ అర్ధమవుతుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/