Begin typing your search above and press return to search.

బుల్లి సినిమాల పోటీ గిమ్మిక్ అందుకే

By:  Tupaki Desk   |   19 April 2017 7:58 AM GMT
బుల్లి సినిమాల పోటీ గిమ్మిక్ అందుకే
X
బాహుబలి2 ది కంక్లూజన్ మూవీ ఈ నెల 28న రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఆరేడు నెలల ముందే అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు. అందుకు తగినట్లుగానే ప్లాన్ చేసుకున్న జక్కన్న అండ్ టీం.. ఇప్పటికే అన్ని భాషలలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు.

ఇప్పుడు బాహుబలితో పోటీ అంటూ కొన్ని సినిమాలు బయల్దేరాయి. మొదటగా అవసరాల శ్రీనివాస్ హీరోగా రూపొందిన అడల్ట్ కామెడీ మూవీ 'బాబు బాగా బిజీ'ని మే 5న రిలీజ్ చేస్తామంటేనే.. కామెడీ చేస్తున్నారంటూ అందరూ నవ్వుకున్నారు. ఇప్పుడు కనీసం ఆ స్థాయి కూడా లేని మరో బుల్లి సినిమా అయితే.. ఏకంగా బాహుబలి2 మరుసటి రోజునే విడుదల చేస్తామని చెబుతున్నారు. హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ హీరోగా రూపొందిన మూవీ వెంకటాపురం. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీని ఏప్రిల్ 29న విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు.

బాహుబలి2 స్థాయిని చూసి.. ఆ దరిదాపుల్లో వచ్చేందుకు ఏ భాషలోనూ రిలీజ్ లు షెడ్యూల్ చేయలేదు. అంత పెద్ద మార్కెట్ ఉన్న బాలీవుడ్ లో కూడా.. బడా సినిమాలేవీ థియేటర్లలోకి రావడం లేదు. అలాంటిది వెంకటాపురం లాంటి చిన్న మూవీ ఏప్రిల్ 29న రిలీజ్ అనడం నిజంగా కామెడీలకే కామెడీ అనాల్సిందే. బాహుబలి2 ఎలా ఉన్నా ఓ రెండు వారాల థియేటర్లను ఇచ్చే సమస్య ఉండదు.

బాహుబలి2 చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో ప్రదర్శిస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఆ తర్వాతి రోజున వెంకటాపురం కోసం.. బాహుబలిని తీసేసి.. తమ సినిమా ప్రదర్శిస్తారని మేకర్స్ ఎలా అనుకున్నారనే డౌట్ రాకమానదు. ఇదంతా బాహుబలి2తో పోటీ అనగానే.. ఉచితంగా వచ్చే పబ్లిసిటీ కోసమే అనడంలో.. ఎనీ డౌట్స్!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/