Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: మర్డర్ మిస్టరీ.. ఇంట్రెస్టింగ్

By:  Tupaki Desk   |   10 Feb 2017 8:33 AM GMT
ట్రైలర్ టాక్: మర్డర్ మిస్టరీ.. ఇంట్రెస్టింగ్
X
హ్యాపీడేస్ మూవీలో టైసన్ గా అలరించిన రాహుల్ ఇప్పుడు పూర్తిగా మేకోవర్ చేసేశాడు. ఆ మధ్య సిక్స్ ప్యాక్ లో కొత్త లుక్స్ కూడా కనిపించాడు. ఇప్పుడీ కుర్రాడు నటించిన కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. వెంకటాపురం అనే టైటిల్ పై రూపొందిన ఈ మూవీ.. మర్డర్ మిస్టరీని ఛేజ్ చేసే కాన్సెప్ట్ తో సాగుతుంది.

భీమిలీ బీచ్ లో శవమై తేలిన ఓ అమ్మాయి హత్యకు సంబంధించిన కేసు ఇన్వెస్టిగేషన్ తో ప్రారంభమైన ట్రైలర్.. చివరి వరకూ గ్రిప్పింగ్ గా సాగుతుంది. హీరో రాహుల్ ఒక పిజ్జా డెలివరీ బాయ్ కాగా.. ఒక్క రోజు బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా అంటూ హీరోయిన్ మహిమ మక్వానా అడుగుతుంది. అందుకు సరే అని ఆ ఒక్క రోజు గడిపేసిన తర్వాత.. అదే అమ్మాయి హత్యకు గురవుతుంది. ఆ హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేసే పోలీసులు.. ఆమె బాయ్ ఫ్రెండే హత్య చేశాడని ఫిక్స్ అవుతారు.

ఇలా అనుమానించడం సహజమే కానీ.. రాహుల్ చేసిన పాత్ర కూడా అనుమానాస్పదంగానే కనిపిస్తుంది. పైగా.. హీరో హీరోయిన్స్ యాంగిల్ నుంచి కాకుండా.. పూర్తిగా పోలీసుల యాంగిల్ నుంచి ట్రైలర్ కట్ చేయడంతో.. ఆద్యంతం ఆసక్తి కలిగిస్తుంది. అచ్చు సంగీతం అందించగా.. కొత్త దర్శకుడు వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ట్రైలర్ ప్రామిసింగ్ గానే ఉంది.. మూవీ కూడా ఇంతటి ఇంట్రెస్టింగ్ గా ఉంటే మాత్రం.. హ్యాపీ డేస్ హీరోల్లో ఒకడైన రాహుల్ కి మంచి రోజులు వచ్చినట్లే.




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/