Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ:'వెంకటాపురం'
By: Tupaki Desk | 13 May 2017 6:18 AM GMTచిత్రం : ‘వెంకటాపురం’
నటీనటులు: రాహుల్ - మహిమ మఖ్వానా - అజయ్ - అజయ్ ఘోష్ - కాశీ విశ్వనాథ్ తదితరులు
సంగీతం: అచ్చు రాజమణి
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్
నిర్మాతలు: శ్రేయాస్ శ్రీనివాస్ - తూము ఫణికుమార్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వేణు మడికంటి
‘హ్యాపీడేస్’లో టైసన్ గా అలరించిన రాహుల్.. ఆ తర్వాత హీరోగా కొన్ని ప్రయత్నాలు చేసి ఫెయిలయ్యాడు. అతను ఈసారి చాలా గ్యాప్ తీసుకుని.. అవతారం మార్చుకుని ‘వెంకటాపురం’ అనే థ్రిల్లర్ చేశాడు. ప్రోమోలతో ఆకర్షించిన ఈ చిత్రం అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
ఆనంద్ (రాహుల్) పిజ్జా డెలివరీ బాయ్ గా పని చేసే కుర్రాడు. అతడికి ఛైత్ర (మహిమ)తో పరిచయమై.. అది ప్రేమగా మారుతుంది. ఇలాంటి సమయంలో ఛైత్ర అనుకోకుండా ఓ సమస్యలో చిక్కుకుంటుంది. ఆ సమస్యను పరిష్కరించబోయి రాహుల్ పోలీసులకు చిక్కుతాడు. రాహుల్ కోసమని వెళ్లి ఛైత్ర కూడా పోలీసుల బారిన పడుతుంది. ఇంతకీ ఛైత్రకు ఎదురైన సమస్య ఏంటి.. పోలీసుల వల్ల ఛైత్ర.. ఆనంద్ ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు. వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి.. చివరికి ఛైత్ర కోసం రాహుల్ ఏం చేశాడు.. అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.
కథనం - విశ్లేషణ:
కొన్ని సినిమాలు బాగున్నట్లు అనిపిస్తాయి. కొన్ని సినిమాలు బాలేదనిపిస్తాయి. కానీ బావున్నట్లే అనిపించి... అంతలోనే బాలేదనిపిస్తూ.. మళ్లీ బాగుందనిపిస్తూ చివరికి ఎటూ కాని ఒక మిశ్రమ అనుభూతిని కలిగించే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘వెంకటాపురం’ ఆ కోవకే చెందుతుంది. ఈ థ్రిల్లర్లో కథాంశం ఓకే అనిపిస్తుంది. థ్రిల్లర్ సినిమాలకు కీలకమైన సస్పెన్స్ ఫ్యాక్టర్ ను బాగానే డీల్ చేశారు. స్క్రీన్ ప్లే కూడా భిన్నంగా ప్రయత్నించారు. కానీ దర్శకుడి అనుభవ లేమి కారణంగా కథను చెప్పడంలో తలెత్తిన గందరగోళం.. నిలకడ లేకుండా ఎత్తు పల్లాలతో సాగే కథనం.. కొన్ని జవాబుల్లేని ప్రశ్నలు.. లాజిక్ లేని సీన్స్.. అంతా కలిసి చివరికి ‘వెంకటాపురం’ ఒక మిశ్రమానుభూతి కలిగిస్తుంది.
ఏదో కొత్తగా చెయ్యాలి.. సిన్సియర్ గా ఒక కథను చెప్పాలి అని కొత్త దర్శకుడు వేణు మడికంటి చేసిన ప్రయత్నం అభినందనీయమే. కాకపోతే ఇంకా మెరుగ్గా తీర్చిదిద్దడానికి అవకాశం ఉండి కూడా సరైన కసరత్తు చేయకుండా హడావుడిగా పని కానిచ్చేసినట్లుగా అనిపిస్తుంది ‘వెంకటాపురం’ చూస్తుంటే. కొన్ని చోట్ల మంచి పనితనం.. ఇంటెన్సిటీ చూపించిన దర్శకుడు.. కొన్ని చోట్ల మరీ సిల్లీ తప్పులు చేయడంతో అవి పంటి కింద రాళ్లలా తగులుతుంటాయి. ఆ పంటి కింద రాళ్లలో ఒకదాని గురించి కొంచెం మాట్లాడుకుందాం.
హీరో కత్తి తీసుకుని ముగ్గుర్ని చంపుదామని బీచ్ కు వెళ్తాడు. వాళ్ల కోసం కాచుకుని ఉంటాడు. అతనేమీ బండ చాటున దాక్కుని ఉన్నట్లు కనిపించడు. ఎదురుగా ఏరియా ఓపెన్ గానే ఉంటుంది. కానీ అవతల అలికిడి కాగానే.. తాను ఎదురు చూసిన వాళ్లు వచ్చేశారనుకుని కళ్లు మూసుకుని కత్తి విసురుతాడు. ఒకరికి ముగ్గుర్ని చంపాలని వచ్చి.. తన ముందుకొచ్చింది ఎవరో కూడా చూడకుండా కళ్లు మూసుకుని అలా కత్తి విసరడంలో లాజిక్ ఏంటో అర్థం కాదు. సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశాన్ని మలిచిన తీరిది. కథను ఆసక్తికరంగా ఆరంభించి.. సస్పెన్స్ ఫ్యాక్టర్ ను అలాగే నిలిపి ఉంచి.. చివరిదాకా ప్రేక్షకుడిని గెస్సింగ్ లో ఉంచి సర్ప్రైజ్ చేయడంలో విజయవంతమైన దర్శకుడు.. అక్కడక్కడా చేసిన ఇలాంటి తప్పిదాల వల్ల ‘వెంకటాపురం’ ఆశించిన మేర ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.
ముందే చెప్పినట్లు ‘వెంకటాపురం’ కథను ఆరంభించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తుంది. తొలి పావుగంటలో సన్నివేశాలు ప్రేక్షకుడిని సీరియస్ గా కథలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి. కానీ అంతలోనే ఏమాత్రం ఆసక్తి రేకెత్తించకుండా సాగే సాదాసీదా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వచ్చి ప్రేక్షకుల మూడ్ ను డిస్టర్బ్ చేస్తుంది. ద్వితీయార్ధంలో రివెంజ్ ట్రాక్ లో ఇంటెన్సిటీ చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు.. ముందు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమబంధాన్ని బలంగా చూపించాల్సిన ఆవశ్యకతను గుర్తించలేదు. సిల్లీ సిల్లీ సన్నివేశాలతో ఈ ట్రాక్ తేలిపోయేలా చేశాడు. ఐతే ఫ్లాష్ బ్యాక్ అయ్యాక ఇంటర్వెల్ దగ్గర మళ్లీ కథనం ట్రాక్ ఎక్కుతుంది. కొన్ని సన్నివేశాల్లో పాత్రలు స్పందించే తీరు.. జవాబు లేని కొన్ని ప్రశ్నలు ప్రేక్షకుడిని తికమక పెట్టినప్పటికీ.. ద్వితీయార్ధం చాలా వరకు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుంది. ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ ఉత్కంఠ రేకెత్తిస్తాయి.
థ్రిల్లర్ సినిమాలంటే కొంచెం ఇంటలిజెంట్ గా.. కన్విన్సింగ్ గా ఉండాలని.. ప్రేక్షకుడి బుర్రకు పరీక్ష పెట్టాలని ఆశిస్తాం. ఐతే ‘వెంకటాపురం’లో కొన్ని సీన్స్ ఈ కోవలోనే సాగినప్పటికీ.. కొన్ని సీన్స్ మాత్రం మరీ పేలవంగా అనిపిస్తాయి. తనకు జరిగిన అన్యాయానికి తన తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నట్లుగా చెబుతుంది హీరోయిన్. అసలు ఆమె తల్లిదండ్రులు ఏమయ్యారో తెలుసుకోవాలని ప్రేక్షకుడు ఉత్కంఠగా ఎదురు చూస్తాడు. దానికి అసలు బదులే లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు హీరోయిన్ తన బ్యాగు కోసమని కోరి ఆపద కొని తెచ్చుకోవడం కన్విన్సింగ్ గా అనిపించదు. తెరమీద జరిగే మరికొన్ని విషయాలు నమ్మశక్యం కాని రీతిలోనూ.. సిల్లీగానూ అనిపిస్తాయి. ఇలాంటి లోపాలు లేకుండా చూసుకుని.. ఇంకొంచెం శ్రద్ధంగా స్క్రిప్టును తీర్చిదిద్దుకుని ఉంటే.. ‘వెంకటాపురం’ మంచి థ్రిల్లర్ అయ్యేది.
నటీనటులు:
‘హ్యాపీ డేస్’లో చూసిన రాహుల్ కు.. ‘వెంకటాపురం’లోని రాహుల్ కు చాలా తేడా గమనించవచ్చు. క్యారెక్టర్.. లుక్ విషయంలో అతడికి సినిమా మేకోవరే. ఐతే నటన పరంగా అతను పెద్దగా చేసిందేమీ లేదు. రాహుల్ ముఖంలో పెద్దగా భావాలేమీ పలకలేదు. హీరోయిన్ మహిమ చూడ్డానికి కొంచెం క్యూట్ గా అనిపిస్తుంది. నటన పర్వాలేదు. కానీ ఆమె హీరోయిన్ పాత్రకు అవసరమైన వెయిట్ తీసుకురాలేకపోయింది. ఆమెలో హీరోయిన్ ఫీచర్స్ లేకపోవడం సినిమాకు మైనస్ అయింది. క్రూరుడైన ఎస్ఐ పాత్రలో అజయ్ ఘోష్ బాగా చేశాడు. అజయ్ సింపుల్ గా తన పాత్రను చేసుకెళ్లిపోయాడు. సినిమాలో అందర్లోకి పర్ఫెక్ట్ అనిపించేది వీళ్లిద్దరే. మిగతా నటీనటులంతా మామూలే.
సాంకేతికవర్గం:
‘వెంకటాపురం’ సినిమాకు సాంకేతిక హంగులు బాగా కుదిరాయి. అచ్చు రాజమణి పాటల గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ.. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. కొన్ని సన్నివేశాల్లో కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్ తోనే ఉత్కంఠ తీసుకొచ్చాడు అచ్చు. సాయిప్రకాష్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. థ్రిల్లర్ సినిమాలకు తగ్గ మూడ్ క్రియేుట్ చేయడంలో కెమెరా పనితనం కీలక పాత్ర పోషించింది. బడ్జెట్ పరిమితుల దృష్ట్యా నిర్మాణ విలువల విషయంలో కొంత రాజీ కనిపిస్తుంది. సినిమాకు డైలాగ్స్ మైనస్ అయ్యాయి. ఎక్కడా కూడా అంతగా ఆసక్తి రేకెత్తించవు. ఇక దర్శకుడు వేణు మడికంటి విషయానికొస్తే.. అతను కథతో మెప్పించాడు. స్క్రీన్ ప్లే కూడా భిన్నంగా ట్రై చేశాడు. కానీ దర్శకుడిగానే అంతగా మెప్పించలేకపోయాడు. స్క్రిప్టును సరిగ్గా తెరమీదికి తీసుకురావడంలో.. బిగితో కథనాన్ని నడపడంలో తడబడ్డాడు. ఐతే కొత్తగా ఏదో చేయాలని ప్రయత్నించినందుకు అతడిని అభినందించవచ్చు.
చివరగా: వెంకటాపురం.. సో సో థ్రిల్లర్
రేటింగ్- 2.25/5
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre