Begin typing your search above and press return to search.
సాయిపల్లవి నవ్వు క్యూట్ గా ఉంటుంది .. నేషనల్ అవార్డు ఖాయం
By: Tupaki Desk | 16 Jun 2022 3:59 AM GMT1990లలో జరిగిన ఒక సంఘటనను ఆధారంగా చేసుకుని దర్శకుడు వేణు ఉడుగుల 'విరాటపర్వం' సినిమాను రూపొందించాడు. గ్రామీణ ప్రాంతంలో .. నక్సలైట్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. సాయిపల్లవి - రానా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 17వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాదులో సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటేశ్ వచ్చారు. ఈ స్టేజ్ పై ఆయన మాట్లాడారు.
"మారదులే ఈ దోపిడీ దొంగల రాజ్యం మారదులే .."అనే ఈ సినిమాలోని డైలాగ్ ను గంభీరంగా చెప్పిన వెంకటేశ్ ఆ వెంటనే మళ్లీ మామూలు మూడ్ లోకి వచ్చేసి " ఏమ్మా రానా ఏంటీ ఫైరూ .. ఏంటిది? రానా ఫస్టు సినిమా దగ్గర నుంచి తీసుకుంటే ఏ పాత్రను ఎంచుకున్నా పూర్తి ఎఫర్ట్ పెడుతూ వెళుతున్నాడు.
అందువల్లనే ఆయన పాత్రలకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నాను ఇది చాలా మంచి సినిమా అవుతుందని.
రానా నువ్వు విన్నర్ అవుతావు .. ఇప్పటికిప్పుడు కాకపోయినా .. ఏదో ఒక రోజున నువ్వు విన్నర్ గా నిలుస్తావు. ఇక ఈ సినిమా చూసిన తరువాత మన తెలుగు ఇండస్ట్రీకి ఒక హానెస్ట్ ఫిల్మ్ మేకర్ వచ్చాడనే విషయాన్ని చెప్పుకుంటారు.
దర్శకుడు వేణు ఎంచుకున్న కథ .. దానిని తెరపై ఆయన ప్రెజెంట్ చేసిన తీరు నాకు ఎంతగానో నచ్చింది. నిజంగా ఆయనకి మంచి భవిష్యత్తు ఉంది. ఈ వేదిక ద్వారా నేను ఆయనను అభినందిస్తున్నాను.
'విరాటపర్వం' సినిమా చూసిన తరువాత అర్థమవుతుంది ... ఈ సినిమా ఎంత గొప్పగా ఉంటుందనేది. ఆర్టిస్టులంతా కూడా ఈ సినిమాను ఎంతో అంకితభావంతో చేశారు. సాయిపల్లవి నవ్వు చాలు .. ఎంతో క్యూట్ గా ఉంటుంది కదా. ఈ సినిమాతో ఆమెకి నేషనల్ అవార్డు వస్తుందని భావిస్తున్నాను. ఇలాంటి సినిమాలెన్నో సాయిపల్లవి చేయాలని కోరుకుంటున్నాను. సూపర్ .. ఎక్స్ ట్రార్డినరీ .. అదిరిపోయిందిగా .. అంతేగా .. అంతేగా" అంటూ 'ఎఫ్ 3' సినిమాలోని తన డైలాగ్ తో ఆయన ముగించారు.