Begin typing your search above and press return to search.
వెంకీ మామ నిర్ణయం సరైనదేనా?
By: Tupaki Desk | 7 Sep 2019 6:22 AM GMTవిక్టరీ వెంకటేష్ - నాగ చైతన్య ఫస్ట్ టైం ఫుల్ లెంత్ కాంబోలో రూపొందుతున్న వెంకీ మామ షూటింగ్ ఫైనల్ స్టేజికి వస్తోంది. ఆ మధ్య వెంకీకి ఏదో గాయం వల్ల కొంత బ్రేక్ పడిందనే టాక్ వచ్చింది కాని ఆ తర్వాత అదేమంత తీవ్రమైనది కాదని మళ్ళి కంటిన్యూ అయ్యిందనే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు తాజాగా అక్టోబర్ 25కి వెంకీ మామను లాక్ చేస్తున్నారనే టాక్ వస్తోంది. టీజర్ తో పాటు డేట్ అనౌన్స్ చేసేలా ప్లానింగ్ జరుగుతోందని వినికిడి.
నిజానికి దీన్ని దసరాకు టార్గెట్ చేసుకునే షూటింగ్ చేసుకుంటూ వచ్చారు. కాని సైరా అక్టోబర్ 2కి ఫిక్స్ అయిపోవడంతో ఆ వారంలో వేస్తే ఓపెనింగ్స్ పరంగా కొంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. పోనీ అక్టోబర్ 8న వస్తే బాగుంటుంది కాని అప్పటికి సెలవులు కేవలం రెండు మూడు రోజులే బాలన్స్ ఉంటాయి. ఈ నేపధ్యంలో అక్టోబర్ 25 సరైన తేదిగా అనుకుని నిర్మాత సురేష్ బాబు ఆ మేరకు సూచనలు ఇస్తూ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది.
అయితే దసరాను మిస్ చేసుకోవడం ఒక రకంగా రాంగ్ స్ట్రాటజీ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఎంత సైరా హిట్ అయినా పండగ సెలవులు కాబట్టి ఈజీగా ఇంకో సినిమాను వదలొచ్చు. ప్రేక్షకులందరూ హాలిడేస్ మొత్తం సైరానే చూస్తూ ఉండరుగా. అలాంటప్పుడు సెకండ్ బెస్ట్ ఛాయస్ గా వెంకీ మామ నిలిస్తుంది. రెండింటి మధ్య ఓ మూడు రోజులు గ్యాప్ ఉన్నా చాలు. కాని ఇప్పుడిలా ఏకంగా మూడో వారానికి షిఫ్ట్ అవ్వడం కమర్షియల్ యాంగిల్ లో ఎంత వరకు కరెక్టో వేచి చూడాలి