Begin typing your search above and press return to search.

మేనమామ వెంకీ.. నాన్న నాగ్ కలిసి!

By:  Tupaki Desk   |   25 Aug 2016 12:38 PM GMT
మేనమామ వెంకీ.. నాన్న నాగ్ కలిసి!
X
ఇప్పుడు నాగ చైతన్య ''ప్రేమమ్'' సినిమాపై ఎన్నడూలేనంత హైప్ వచ్చేసింది. కారణం ఏంటంటే.. చాన్నాళ్ళుగా తెలుగులో అసలు లవ్ స్టోరీలు రాకపోవడం.. అలాగే రొమాంటిక్ ఫిలింస్ అనేవి కొరవడడంతో.. రాక రాక వస్తున్న అలాంటి సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఖచ్చితంగా భారీ అంచనాలతోనే ఉంటారు.

దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రేమమ్ సినిమాను దసరాలో రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించేశారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు సీనియర్ స్టార్లు తమ నిజజీవితపు పాత్రలు చేస్తున్నారు తెలుసా? ఇప్పటికే చైతన్య కు మావయ్య అయిన హీరో వెంకటేష్‌.. సినిమాలో కూడా మావయ్య పాత్రనే చేసేశారు. ఆయన ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఇవాళ్టి నుండి నాగార్జున పార్ట్ ను షూట్ చేస్తున్నారు. ఈయన కూడా సినిమాలో తన నిజజీవితపు రోల్ అయిన తండ్రి క్యారెక్టర్లోనే కనిపిస్తారట. అసలు ఒక ప్రక్కన మావయ్య.. మరో ప్రక్కన డాడ్ సీనియర్ హీరోలవ్వడం ఒక విషయమైతే.. వారిద్దరూ ఈ సినిమాలో కనిపించడం ఇంకా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం.

చందు మొండేటి డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ మెయిన్ హీరోయిన్. అనుపమ పరమేశ్వరన్ అండ్ మడోన్నా సెబాస్టియన్ మరో ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో చైతూ పెద్ద హిట్టు కొడతాడనే ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల అంచనా. వెయిట్ అండ్ సీ.