Begin typing your search above and press return to search.
వెంకీ-పూరీ అంత పెట్టేస్తున్నారా?
By: Tupaki Desk | 29 Dec 2016 7:47 AM GMTవెంకటేష్-పూరీ జగన్నాధ్ ల మూవీ ఖాయం అయిన సంగతి తెలిసిందే. బాబు బంగారంతో నిరాశపడ్డ వెంకటేష్.. ఇజంతో ఎదురు దెబ్బ పూరీ జగన్నాధ్.. ఇద్దరూ కలిసి ఓ సూపర్బ్ ప్రాజెక్ట్ ని ఫైనల్ చేశారట. పూరీ చెప్పిన లైన్ కి విక్టరీ వెంకటేష్ ఫుల్లుగా ఫ్లాట్ అయిపోయాడని తెలుస్తోంది. అందుకే బడ్జెట్ విషయంలో కూడా కాంప్రమైజ్ కావడం లేదని అంటున్నారు.
వెంకటేష్ తో సినిమా కోసం ఏకంగా 45 కోట్ల బడ్జెట్ ని డిమాండ్ చేశాడట పూరీ. స్క్రిప్ట్ అవసరానికి తగినట్లుగానే ఈ బడ్జెట్ మార్క్ ఉండడంతో.. వెంకీ సై అనేశాడని.. పనులు స్టార్ట్ చేసేయమన్నాడని చెబుతున్నారు. వెంకటేష్ మార్కెట్ ప్రకారం చూసుకుంటే ఇది చాలా ఎక్కువ బడ్జెట్. వెంకీ మార్కెట్ 30 కోట్ల లోపే ఉంటుందని తెలిసిన ఆయన బ్రదర్ సురేష్ బాబు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండమని సూచించినట్లు తెలుస్తోంది.
కానీ ఈ స్క్రిప్ట్ ను.. పూరీ నెరేట్ చేసిన విధానాన్ని చూసిన వెంకీ.. సబ్జెక్ట్ ను ఏ మాత్రం వదులుకోవడానికి ఇష్టపడ్డం లేదని తెలుస్తోంది. అందుకే తన ముప్ఫై ఏళ్ల కెరీర్ లో మొదటిసారిగా పూరీ మూవీతో నిర్మాతగా మారబోతున్నాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని సురేష్ బాబుతో కలిసి నిర్మించనున్నాడట వెంకీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/