Begin typing your search above and press return to search.

త్వరలో బాబాయ్ అబ్బాయ్ కాంబినేషన్

By:  Tupaki Desk   |   26 July 2017 10:23 AM GMT
త్వరలో బాబాయ్ అబ్బాయ్ కాంబినేషన్
X
ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా డిఫరెంట్ సినిమాలు చేయడంలో విక్టరీ వెంకటేష్ ముందుంటారు. అందుకే అన్ని వర్గాల్లోనూ ఆయనకు అభిమానులుంటారు. కథ నచ్చితే మల్టీ స్టారర్ సినిమాలు చేస్తానని చెప్పడమే కాకుండా చేసి చూపించారు. మహేష్ బాబుతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. పవన్ కళ్యాణ్ తో గోపాలా.. గోపాలా సినిమాలు చేశారు.

మాధవన్ హీరోగా నటించిన హిందీ సినిమా సాలా ఖడూస్ రీమేక్ గా తెలుగులో వచ్చిన గురు సినిమాలో లేటెస్ట్ గా నటించిన వెంకటేష్ ఆ తర్వాత ఇంతవరకు ఏ చిత్రాన్నీ ఫైనలైజ్ చేయలేదు. ఆయన సోదరుడు సురేష్ తన కొడుకు రానా - వెంకటేష్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ తీయాలన ఆలోచిస్తున్నారనేది లేటెస్ట్ టాక్. రానా లేటెస్ట్ సినిమా నేనే రాజు నేనే మంత్రి రిలీజ్ తర్వాత దీనికి సంబంధించి సబ్జెక్టు పైనలైజ్ చేసే అవకాశముంది. ఇంతకముందు రానా హీరోగా నటించిన కృష్ణం వందే జగద్గురం సినిమాలో వెంకటేష్ ఓ కామియో పాత్రలో నటించారు. ఈమధ్య వచ్చిన ప్రేమమ్ సినిమాలోనూ నాగచైతన్య మేనమామగా రెండు సీన్లలో కనిపించారు.

సినిమా ఇండస్ట్రీలో ఒకే ఫ్యామిలీలోని వారు ముగ్గురు - నలుగురు హీరోలుగా నటిస్తున్నా కలిసి నటించే సందర్భాలు తక్కువే. ఇమేజ్ కారణంగానే.. సరైన కథ దొరకలేదన్న కారణంతోనే ఇండివిడ్యువల్ గానే సినిమాలు చేస్తుంటారు. సురేష్ బాబు ఆలోచన వర్కవుట్ అయితే కొత్త ట్రెండ్ మొదలుకావచ్చు.