Begin typing your search above and press return to search.
28 ఏళ్ళ తర్వాత వెంకీ సరసన
By: Tupaki Desk | 10 Jun 2019 5:46 AM GMTవిక్టరీ తన ఇంటి పేరుగా మారిపోయి స్టార్ గా ఎదుగుతున్న క్రమంలో వెంకటేష్ చేసిన సినిమా 1991లో విడుదలైన కూలీ నెంబర్ 1. కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీని సురేష్ సంస్థ నిర్మించింది. కమర్షియల్ గా మ్యూజికల్ గా పెద్ద హిట్ గా నిలిచిన ఆ మూవీలో పాటలంటే ఇప్పటికీ ఇళయరాజా ఫ్యాన్స్ కు ఎవర్ గ్రీన్ నెంబర్స్. దాని ద్వారానే బాలీవుడ్ బ్యూటీ టబు సిల్వర్ స్క్రీన్ కు పరిచయమయ్యింది.
డబ్బున్న పొగరుబోతు అమ్మాయి పాత్రలో మెప్పించగా కలయా నిజమా పాటలో ఒలకబోసి అందాలకు అప్పటి యూత్ కి కొద్దిరోజుల పాటు కునుకు దూరమయ్యింది. తర్వాత హిందీ ఆఫర్స్ తో నార్త్ కు వెళ్ళిపోయిన టబు నిన్నే పెళ్లాడతాలో నాగ్ తో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అదంతా గతం . మధ్యలో అడపాదడపా సినిమాలు చేసినా టబు తెలుగులో కనిపించడం బాగా తగ్గించేసింది. ఇన్నాళ్ళకు మళ్ళి తన మొదటి హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది
ఇటీవలే హిందిలో విడుదలైన అజయ్ దేవగన్ దే దే ప్యార్ దే తెలుగులో సురేష్ సంస్థ వెంకటేష్ తో అఫీషియల్ గా రీమేక్ చేయనుంది. ఇప్పటికే హక్కులు కోనేసుకున్నారు. వయసు మళ్ళిన హీరో ఓ పాతికేళ్ళ యువతీ ప్రేమలో పడటం అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. హింది వెర్షన్ లో అజయ్ దేవగన్ మాజీ భార్యగా టబు నటించగా తెలుగులో వెంకీ సరసన అదే పాత్ర చేసేందుకు ఓకే చెప్పినట్టు తెలిసింది. అంటే 28 ఏళ్ళ తర్వాత టబు వెంకీ మళ్ళి భార్యాభర్తలుగా నటించబోతున్నారన్న మాట. అధికారిక ప్రకటన మరికొద్ది రోజుల్లో రావొచ్చు. దర్శకుడు ఇంకా సెట్ కాని ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర ఎవరు చేస్తారు అనేది ఇంకా డిసైడ్ కాలేదు.