Begin typing your search above and press return to search.
సైలెంట్ గా `ఆట` మొదలెట్టేసిన వెంకీ!
By: Tupaki Desk | 4 Dec 2017 11:00 AM GMTచాలా కాలం తర్వాత `నేనే రాజు నేనే మంత్రి ` తో విలక్షణ దర్శకుడు తేజ హిట్ అందుకున్నాడు. ఆ చిత్ర హీరో దగ్గుబాటి రాణాకు కూడా ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. బాహుబలి తర్వాత వస్తున్న `అబ్బాయి` సినిమా మీద `బాబాయి` విక్టరీ వెంకటేష్ స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఎడిటింగ్ ను వెంకటేష్ దగ్గరుండి పర్యవేక్షించారనే వార్తలు కూడా వచ్చాయి. ఆ సమయంలోనే వెంకీకి తేజ చెప్పిన కథ నచ్చడంతో త్వరలోనే వారిద్దరూ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ చిత్రం ఎపుడు ప్రారంభమవుతుందనే విషయం పై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. వెంకటేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 13వ తేదీన ఆ సినిమాను ప్రారంభించబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా ఆ సినిమాను ఈ రోజు ఉదయం సింపుల్ గా లాంచ్ చేసేశారు. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో వెంకీ - తేజల కాంబోలో తెరకెక్కబోతోన్న చిత్రానికి ఈ రోజు ప్రారంభోత్సవం జరిగింది. చాలా సాదాసీదాగా కొద్ది మంది అతిథుల మధ్య ఈ కార్యక్రమం సింపుల్ గా జరిగింది. త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
అయితే, ఇంత హడావిడిగా - సైలెంట్ గా ఈ చిత్ర షూటింగ్ ను ప్రారంభించడానికి ఓ కారణం ఉంది. వాస్తవానికి వెంకీ బర్త్ డే నాడు ఈ సినిమాను లాంచ్ చేయాలనుకున్నారు. అయితే, ఆ రోజు వెంకటేష్ తన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి ఫారెన్ వెళుతున్నాడు. ఆ కారణంతోనే ఈ రోజు సైలెంట్ గా లాంచింగ్ ప్రోగ్రామ్ ను పూర్తి చేశారు. ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ లో ఓ అరుదైన సన్నివేశం కనిపించింది. విక్టరీ వెంకటేష్ తన సినిమాకు తనే క్లాప్ కొట్టుకున్నాడు. ఈ కార్యక్రమానికి రాణా - పరుచూరి బ్రదర్స్ తో పాటు నిర్మాత అనీల్ సుంకర - రాజా రవీంద్ర స్పెషల్ గెస్ట్ లుగా వచ్చారు. సురేశ్ ప్రొడక్షన్స్ - ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిచనున్నారు. మిగతా నటీనటులు - సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటించనుంది. ఈ సినిమాలో వెంకీ బావ పాత్రను రాజశేఖర్ పోషించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయం పై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.