Begin typing your search above and press return to search.

ఇద్దరికి కూడా ఇంట్రెస్ట్‌ లేదనిపిస్తుంది

By:  Tupaki Desk   |   11 Dec 2019 6:41 AM GMT
ఇద్దరికి కూడా ఇంట్రెస్ట్‌ లేదనిపిస్తుంది
X
గత మూడు నాలుగు సంవత్సరాల నుండి కూడా వెంకటేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం లో ఒక సినిమా రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో త్రివిక్రమ్‌ రచయిత గా వెంకటేష్‌ నటించిన 'మల్లీశ్వరి' మరియు 'నువ్వు నాకు నచ్చావ్‌' సినిమాలకు వర్క్‌ చేశాడు. అప్పుడే త్రివిక్రమ్‌ కు వెంకటేష్‌ అవకాశం ఇవ్వాలనుకున్నాడు. కాని కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మళ్లీ ఈమద్య ఇద్దరు కూడా తమ కాంబో మూవీ గురించి మాట్లాడారు. వెంకటేష్‌ ఆమద్య ఒక ఇంటర్వ్యూ లో నాకు యాప్ట్‌ అయ్యే కథ ను తీసుకు వస్తే తప్పకుండా నటిస్తానంటూ చెప్పడం జరిగింది.

త్రివిక్రమ్‌.. వెంకటేష్‌ ల కాంబో ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అంటూ ఫ్యాన్స్‌ ఎదురు చూస్తూ వస్తున్నారు. ఎఫ్‌ 2 తర్వాత త్రివిక్రమ్‌ తో వెంకీ చేస్తాడనుకున్నారు. కాని వెంకీ మామ సినిమాతో బిజీ అయ్యాడు. వెంకీ మామ తర్వాత కూడా వెంకటేష్‌ మాటల మాంత్రికుడితో సినిమా చేయడం కష్టం అయ్యేలా ఉంది. ఎందుకంటే ఇప్పటికే వెంకీ మూడు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. త్రివిక్రమ్‌ కూడా అల వైకుంఠపురం లో సినిమా తర్వాత ఒక యంగ్‌ స్టార్‌ హీరోతో సినిమాను చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు.

వీరిద్దరు కూడా వరుసగా వేరు వేరు సినిమాలు చేస్తున్నారు. వీరి కాంబో మూవీపై అప్పుడు ఆసక్తి చూపించారు కాని.. ఇప్పుడు వారికి ఆసక్తి ఉన్నట్లుగా కనిపించడం లేదు అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్‌ కూడా వెంకటేష్‌ త్రివిక్రమ్‌ తో సినిమా ఆలోచనను పక్కకు పెట్టినట్లున్నాడు అనుకుంటున్నారు. ఇద్దరికి కూడా ఇంట్రెస్ట్‌ లేదని.. ఎవరికి వారే వరుస గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారంటూ ఫ్యాన్స్‌ అంటున్నారు.