Begin typing your search above and press return to search.

ఎఫ్2 కామెడీ ఓకే కాని మరి కథ?

By:  Tupaki Desk   |   12 Jan 2019 5:30 PM GMT
ఎఫ్2 కామెడీ ఓకే కాని మరి కథ?
X
ఇవాళ విడుదలైన వెంకటేష్ వరుణ్ తేజ్ ల మల్టీ స్టారర్ ఎఫ్2 పాజిటివ్ టాక్ తో మొదలైంది. సెకండ్ హాఫ్ మీద కంప్లైంట్ ఉన్నప్పటికీ వెంకీ కామెడీ టైమింగ్ మీద అవుట్ అండ్ అవుట్ మంచి రిపోర్ట్స్ రావడంతో ఫ్యామిలీ సెక్షన్ మొత్తం దీనికే మొగ్గు చూపుతున్నారు. ఇంత చేసినా సినిమా మొత్తాన్ని ఒకే టోన్ లో దర్శకుడు అనిల్ రావిపూడి తీయకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం వెంకీ తన భుజాల మీదే మోసినా ఆ తర్వాత రెండో సగం నుంచి తనూ హెల్ప్ లెస్ అయ్యాడు. కారణం సరైన కథ లేకపోవడమే. కేవలం ప్రకాష్ రాజ్ ఇంట్లోనే గంటకు పైగా ఎపిసోడ్ రన్ చేయడంతో డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగింది.

ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులు తెచ్చుకున్న ఇంప్రెషన్ దాంతో చాలా మటుకు తగ్గిపోయింది. టెంపో డౌన్ అయిపోవడంతో హాఫ్ మీల్స్ తిన్న ఫీలింగే వచ్చిందని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం నుంచే ఎఫ్2 షూటింగ్ టైంలో అనిల్ రావిపూడి పూర్తి స్క్రిప్ట్ సిద్ధం కాకుండానే మొదలుపెట్టాడని ఈ కారణంగానే వెంకటేష్ చిన్నపాటి క్లాస్ తీసుకున్నాడని టాక్ వచ్చింది.

అందులో నిజమెంతుందో పక్కన పెడితే ఓ ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయానా వెంకటేష్ ఈ విషయం గురించి చెబుతూ పూర్తి స్క్రిప్ట్ అందుబాటులో లేకపోయినా అనిల్ రావిపూడి పనితనం నచ్చి కొంత వెసులుబాటు ఇచ్చానని చెప్పాడు. అంటే సం థింగ్ అంటూ వచ్చిన గాసిప్ నిజమేనెమో అన్న అనుమానం రాకమానదు. ఎఫ్2 కు ఎంత మంచి టాక్ వచ్చినా ఫైనల్ గా బ్లాక్ బస్టర్ కాలేదని ట్రేడ్ నుంచి వస్తున్న ప్రాధమిక సమాచారం. అపోజిషన్ వీక్ గా ఉండటంతో అది ప్లస్ అవ్వొచ్చేమో కానీ అనిల్ ఇకనైనా ముందు వచ్చే సినిమాలకు పూర్తి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో రెడీ అయితే బెటర్