Begin typing your search above and press return to search.
`మా` వివాదాన్ని సింపుల్ గా తేల్చేసిన వెంకీ
By: Tupaki Desk | 18 July 2021 10:57 AMమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేన్ (మా) లో పోటీదారుల మధ్య నువ్వా? నేనా? అన్న స్థాయిలో పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ .. వీకే నరేష్ ఎపిసోడ్స్ అనంతరం మెగా బ్రదర్ నాగబాబు సహా పలువురు నటీనటుల స్పందన తెలిసినదే. మా అసోసియేషన్ రాజకీయాలన్నీ సొంత భవంతి నిర్మాణం చుట్టూనే తిరుగుతున్నాయి. ఇటీవలే నటసింహ బాలకృష్ణ కూడా `మా` కు ఇప్పటివరకూ సొంత భవనం ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ ప్రశ్నించారు. `మా` నిధి దుబారా అవుతుందంటూ అసహనం వ్యక్తం చేసారు. చివరిగా ఇలా `మా` లో ఎన్ని సమస్యలున్నా వాటన్నింటిని పరిష్కరించుకుని సభ్యులకు మంచి జరిగేలా చూడాలన్నదే అంతిమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో తాజాగా విక్టరీ వెంకటేష్ కూడా ఈ వివాదంపై స్పందించారు. విబేధాలు తలెత్తడం సహజం. ప్రతీ రంగంలోనూ ఇలాంటివి ఉంటాయి. ఏం జరిగినా సరే అంతా మంచిగానే జరగాలి. అందరూ బాగుండాలి. జీవితంలో ప్రతీది మంచి జరగాలనే కోరుకోవాలి. పాజిటివ్ గానే ఉండాలని తనదైన శైలిలో సింపుల్ గా స్పందించారు.
ఇక వెంకటేష్ వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు. వాటి గురించి ప్రశ్నించినా సింపుల్ గా తేల్చేస్తారు. రాజకీయాల గురించి.. ఇతర వ్యక్తుల పై వచ్చే కామెంట్లపై కూడా ఏనాడు స్పందించింది లేదు. బహుశా వివేకానందుని సూక్తులపైనా కర్మ సిద్ధాంతంపైనా అవగాహన కలిగి ఉన్న ఏ జ్ఞాని అయినా ఇలానే స్పందిస్తారని ప్రూవైంది. పక్క వాడి బరువు కూడా మన నెత్తిన వేసుకుని మోస్తుంటాం.. అది వద్దని వివేకానందుడు తన లెస్సన్స్ లో చెబుతుంటారు. కానీ మనిషి పదే పదే అదే చేస్తుంటాడు.. అని వెంకీ చాలాసార్లు బర్త్ డే ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇప్పుడు మా వివాదం విషయంలోనూ ఆయన సమాధానం అలానే ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక వెంకటేష్ కథానాయకుడిగా నటించిన `నారప్ప` ఈనెల 20న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.