Begin typing your search above and press return to search.
కామెడీ కాప్ రోల్ లో మరోసారి వెంకీ
By: Tupaki Desk | 20 Nov 2015 1:30 PM GMTవిక్టరీ వెంకటేష్ కి పోలీస్ పాత్రలు చేయడం కొత్తేం కాదు. గతంలోనూ పలు మూవీస్ లో ఈ పాత్రను పోషించాడు. సీరియస్ అస్సాసినేట్ రోల్ ని ఘర్షణలో పోషించగా.. కామెడీ చేస్తుండే సీరియస్ పోలీస్ రోల్ ను సూపర్ పోలీస్ మూవీలో చేశాడు. ఇప్పుడు మరోసారి నవ్వులు పూయించే కాప్ రోల్ లో వెంకటేష్ కనిపించబోతున్నాడు. భలేభలే మగాడివోయ్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన మారుతీతో వెంకీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్ అయింది.
ఇందులో వెంకటేష్ పాత్ర ఓ పోలీస్ అని తెలుస్తోంది. ఈ సినిమాకి రాధాకృష్ణ అనే పేరు పెట్టనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏడాది క్రితం వెంకీతో రాధా అనే మూవీని మారుతీ చేయాల్సి ఉంది. ఇప్పుడా స్టోరీనే మళ్లీ కొన్ని మార్పులతో ఫైనల్ చేశారని టాలీవుడ్ అంటోంది. అయితే.. ఈ రూమర్స్ ని మేకర్స్ కొట్టి పడేస్తున్నారు. తాము పూర్తిగా కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేశామని అంటున్నారు. అలాగే టైటిల్ విషయంలో కూడా తాము ఇంకా ఏ నిర్ణయానికి రాలేదని చెప్పారు. కానీ హారిక హాసినీ బ్యానర్ పై మూవీ చేయడం మాత్రం ఫైనల్ అయింది.
వెంకీ సరసన మరోసారి నయనతార ఆడి పాడనుంది. ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తోంది. అందుకే పెర్ఫామెన్స్ ఓరియెంట్ రోల్ కి నయన్ ని ఎంపిక చేసుకున్నారట. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ 2016 జనవరిలో ప్రారంభం కానుంది. పక్కా ప్లాన్ తో జెట్ స్పీడ్ లో మూవీ కంప్లీట్ చేసి సమ్మర్ కి సినిమాను సిల్వల్ స్క్రీన్ పైకి తేవాలన్నది మారుతీ ఆలోచనగా తెలుస్తోంది.