Begin typing your search above and press return to search.
క్రికెట్లో పడితే వెంకీ అంతే మరి..
By: Tupaki Desk | 18 April 2017 8:51 AM GMTమన సినీ తారల్లో చాలామంది స్పోర్ట్స్ లవర్స్ ఉన్నారు. ముఖ్యంగా వాళ్లలో చాలామంది క్రికెట్ అంటే పడి చస్తారు. ఐతే ఈ క్రికెట్ ఆభిమానం విషయంలో విక్టరీ వెంకటేష్ తర్వాతే ఎవరైనా. ఉప్పల్ స్టేడియంలో ఏదైనా ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగినా.. లేదా ఐపీఎల్ మ్యాచ్ జరిగినా వెంకీ అక్కడ ప్రత్యక్షమవ్వాల్సిందే. షూటింగ్ గీటింగ్ జాన్తా నై. మ్యాచ్ షెడ్యూళ్లు చూసుకుని.. ఆ రోజుకు కచ్చితంగా స్టేడియంలో ప్రత్యక్షం అయిపోతాడు వెంకీ. ఈ ఐపీఎల్ సీజన్లోనూ సన్ రైజర్స్ ఆడే ప్రతి మ్యాచ్ లోనూ వెంకీ సందడి చేస్తున్నాడు. ఇక సోమవారం సన్ రైజర్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ సందర్భంగా వెంకీ చేసిన సందడి అంతా ఇంతా కాదు.
సగటు క్రికెట్ అభిమాని ఎలా స్పందిస్తాడో అలాగే రెస్పాండయ్యాడు వెంకీ. సన్ రైజర్స్ ఆటగాళ్లు ఫోరో సిక్సరో బాదినా.. ఆ జట్టు బౌలర్ వికెట్ తీసినా వెంకీ మామూలుగా రెచ్చిపోలేదు. ముఖ్యంగా కింగ్స్ ఎలెవన్ జట్టు లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగాక పేసర్ భువనేశ్వర్ తొలి వికెట్ తీయగానే వెంకీ చిన్న పిల్లాడైపోయాడు. ఎగిరెగిరి గంతులేస్తూ చాలా ఎగ్జైట్ అయిపోయాడు వెంకీ. ఇక మ్యాచ్ టెన్షన్ టెన్షన్ గా జరుగుతున్న టైంలో బంతి బంతికీ వెంకీ పడ్డ ఉత్కంఠను గమనించాల్సింది. మ్యాచ్ చాలా టైట్ గా నడుస్తున్న టైంలో ప్రత్యర్థి బ్యాట్స్ మన్ మనన్ వోహ్రా సిక్సర్ కొట్టగానే ఏదో కోల్పోయినట్లు ఫేస్ పెట్టాడు వెంకీ. ఇక సన్ రైజర్స్ మ్యాచ్ గెలిచాక వెంకీని పట్టలేకపోయారు అక్కడివాళ్లు. ఈ మ్యాచ్ అంతటా కెమెరాలు వెంకీ మీదే ఫోకస్ చేయడం విశేషం. వెంకీ క్రికెట్ ను ఏ స్థాయిలో ఆస్వాదిస్తాడో.. సన్ రైజర్స్ టీంను అతనెంతగా ఓన్ చేసుకున్నాడో చెప్పడానికి ఇది రుజువు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/