Begin typing your search above and press return to search.

విక్ట‌రీ వెంక‌టేష్ ఫేవ‌రెట్ హీరో ఎవ‌రో తెలుసా?

By:  Tupaki Desk   |   21 Feb 2023 10:10 AM GMT
విక్ట‌రీ వెంక‌టేష్ ఫేవ‌రెట్ హీరో ఎవ‌రో తెలుసా?
X
లెజెండరీ న‌టుడు అందగాడు శోభన్ బాబు నాటి అగ్ర హీరోలలో ఒకరిగా ఉన్న‌త స్థానాన్ని అందుకున్నారు. మ‌హిళా ప్రేక్ష‌కుల ఆరాధ్య‌హీరోగా శోభన్ బాబు ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన అన్ని సినిమాల్లో స్మార్ట్ లుక్స్ తో నుదుటిపై ప్ర‌త్యేక‌మైన రింగ్ తో మ‌గువ‌ల‌ను స‌మ్మోహ‌నానికి గురి చేసేవారు. కెరీర్ లో ఎన్నో కుటుంబ క‌థా చిత్రాల్లో న‌టించారు. చాలా బ్లాక్ బ‌స్ట‌ర్లు ఉన్నాయి. అయితే శోభ‌న్ బాబు కెరీర్ చివరిలో మీడియాలో బాహాటంగా ఎక్కువగా కనిపించలేదు. త‌న‌ ఇంటర్వ్యూలు స‌రిగా రికార్డ్ కాలేదు. ఏవో కొన్ని విలువైన ఫోటోలు మాత్రమే వెబ్ లో క‌నిపిస్తాయి.

వెంకటేష్ సినిమా ఈవెంట్ లలో ఒకదానిలో విక్టరీ వెంకటేష్- శోభన్ బాబుతో క‌లిసి ఇలా క‌నిపించిన అరుదైన క్ష‌ణాన్ని ఫోటోగ్రాఫ‌ర్ క్లిక్ మ‌నిపించారు. నాటి త్రోబ్యాక్ ఫోటో ఇప్ప‌టికీ మ‌ర‌పురాని జ్ఞాప‌కం. ఈ ఫోటోలో ఇద్దరు హీరోలు చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నారు. నిజానికి వారి మ‌ధ్య అనుబంధం కూడా అంతే గొప్ప‌ది. అంద‌గాడు శోభ‌న్ బాబుకి విక్ట‌రీ వెంక‌టేష్ వీరాభిమాని. ఆయ‌న‌పై ఎంతో అభిమానం కురిపించేవారు.

#త్రోబ్యాక్ మ్యాట‌ర్ లోకి వెళితే వెంక‌టేష్ నిర్మించిన ఏకైక చిత్రం శోభ‌న్ బాబుతోనే అనేది ఎంద‌రికి తెలుసు? వెంకీ శోభ‌న్ బాబుకు గొప్ప అభిమాని.. త‌న‌తో సినిమాలు తీసేందుకు ఒక బ్యాన‌ర్ నే స్థాపించాడ‌న్న‌ది కొంద‌రికి మాత్ర‌మే తెలిసిన నిజం.

వెంకీ హీరో మాత్ర‌మే అనుకుంటాం కానీ నిర్మాత అయ్యాడ‌నేది బ‌య‌టికి పెద్ద‌గా తెలీదు. వెంకటేష్ ఎంటర్ ప్రైజెస్ అనే ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించి శోభన్ బాబు -వాణిశ్రీ జంట‌గా 'ఎంకి నాయుడు బావ' అనే సినిమాని వెంక‌టేస్‌ నిర్మించారు. 18 వ‌య‌సులోనే వెంకీ నిర్మాత అయ్యారు. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు అరుదుగానే క‌నిపిస్తాయి.

రామానాయుడు సమర్పణలో 'ఎంకి నాయుడు బావ' చిత్రానికి బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు. సినిమా స్కోప్ -ఈస్ట్ మన్ కలర్ లో రూపొందించారు. ఈ చిత్రంలో గుమ్మడి- కాంతారావు- రావు గోపాల రావు- అల్లు రామలింగయ్య- రాజబాబు వంటి టాప్ తారాగ‌ణం నటించారు.

ఇక ఈ సినిమా తరువాత వెంకటేష్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళిపోయారు. విదేశాల్లోనే నటనలో శిక్షణ తీసుకుని 'కలియుగ పాండవులు' చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేసారు. వెంకీ హీరో అయ్యాక త‌న సోద‌రుడు డి.సురేష్ బాబు నిర్మాత‌గా ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించారు. త‌ర్వాత చ‌రిత్ర తెలిసిందే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.