Begin typing your search above and press return to search.

ఆ లుక్ కోసం 9 నెలలు పట్టిందట

By:  Tupaki Desk   |   23 Sep 2016 4:56 AM GMT
ఆ లుక్ కోసం 9 నెలలు పట్టిందట
X
విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో గురు చిత్రం షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది. షూటింగ్ ప్రారంభానికి ముందే మూవీ ఫస్ట్ లుక్ ని కూడా యూనిట్ విడుదల చేసేసింది. ఇప్పటికే యూనిట్ దగ్గర రిలీజ్ డేట్ పై కూడా పక్కా ప్లాన్ ఉందనే టాక్ ఉంది. ఇంత పర్ఫెక్ట్ గా ఉండడం వెనక.. పక్కా ప్రణాళిక ఉందని తెలుస్తోంది.

సాలా ఖద్దూస్ చిత్రాన్ని వెంకీ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నిజానికి డైరెక్టర్ సుధ కొంగర.. ఈ చిత్రాన్ని తెలుగు-తమిళ్-హిందీ భాషల్లో ఒకేసారి తీయాలని అనుకుందట. వెంకీని ఈ పాత్ర కోసం అప్రోచ్ కాగా.. అప్పట్లో వెంకీకి వైరల్ ఫీవర్ రావడంతో.. తమిళ్-హిందీ వెర్షన్ల కోసం తీసుకున్న ఇతర నటుల డేట్స్ ను మార్చే వీలు లేక.. అప్పుడు సినిమాను మొదలు పెట్టేశారు. హిందీలో సాలాఖద్దూస్ గాను.. తమిళ్ లో ఇరుదుసూత్రు అనే టైటిల్ తోను ఈ మూవీ విడుదలైంది. ఇప్పుడు తెలుగులో రీమేక్ కానుండగా.. మాధవన్ కనిపించిన లుక్ లో వెంకీ ఏ మాత్రం కష్టపడగలడని అందరూ అనుకున్నారు.

కానీ ఈ సినిమాను తెలుగులో చేసే ఆలోచనలో ముందునుంచే ఉన్న వెంకీ.. దాదాపు 9 నెలలుగా స్పెషల్ ఫిట్నెస్ కోచ్ ల దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడట. బాక్సింగ్ కోచ్ గా పర్ఫెక్ట్ లుక్ ని అందుకే వెంకటేష్ ఇవ్వగలిగాడని తెలుస్తోంది. ఈ ఏజ్ లో కూడా.. వెంకీ చూపించిన కమిట్ మెంట్ చూసి అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి.