Begin typing your search above and press return to search.
గురు టీజర్.. ముహూర్తం కుదిరింది
By: Tupaki Desk | 29 Nov 2016 11:30 AM GMTవిక్టరీ వెంకటేష్ స్పీడు మామూలుగా లేదు. ‘బాబు బంగారం’ తర్వాత మొదలుపెట్టిన ‘గురు’ సినిమాను కేవలం మూడు నెలల్లో ఫినిష్ చేసేశాడీ సీనియర్ హీరో. ఈ సోమవారమే ‘గురు’కు గుమ్మడికాయ కొట్టేశారు. రీమేక్ కావడం.. ఒరిజినల్ తీసిన సుధ కొంగరనే తెలుగు వెర్షన్ కూ దర్శకత్వం వహించడం.. బౌండెడ్ స్క్రీప్టుతో.. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగడంతో సినిమా చాలా వేగంగా పూర్తయింది.
పైగా ఈ సినిమాకు 15 నిమిషాల దాకా తమిళ వెర్షన్లోని ఫుటేజ్ వాడుకుంటున్నారట. దీంతో ఆ మేరకు షూటింగ్ డేస్ తగ్గాయి. వెంటనే డబ్బింగ్ కూడా మొదలుపెట్టేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. నిజానికి సంక్రాంతికే సినిమా రెడీ అయిపోతుంది కానీ.. అప్పటికి పోటీ తీవ్రంగా ఉండటంతో గణతంత్ర దినోత్సవానికి సినిమాను షెడ్యూల్ చేశారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు.
డిసెంబరు 13న వెంకీ పుట్టిన రోజు సందర్భంగా ‘గురు’ ఫస్ట్ టీజర్ రిలీజవుతుంది. జనవరి మొదటి వారంలో ఆడియో వేడుక చేసి.. ట్రైలర్ లాంచ్ చేస్తారు. వెంకీ బాక్సింగ్ కోచ్ గా కనిపించబోయే ఈ సినిమాలో రితికా సింగ్.. అతడి శిష్యురాలి పాత్రను పోషించింది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైనాట్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. తమిళ-హిందీ భాషల్లో సూపర్ హిట్ అయిన ‘ఇరుదు సుట్రు/సాలా ఖడూస్’కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/