Begin typing your search above and press return to search.
ద్వితీయం కోసం కేరళకు వెళ్లిన వెంకీ
By: Tupaki Desk | 30 March 2021 3:30 AM GMTప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోగా నిలిచారు వెంకటేష్. ఆయన ఇప్పటికే నారప్ప సినిమా షూటింగ్ ను ముగించేశాడు. ఇప్పటికే ఎఫ్ 3 సినిమా షూటింగ్ ప్రారంభించి చకచక చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు. ఇదే సమయంలో మలయాళం సూపర్ హిట్ మూవీ దృశ్యం 2 రీమేక్ ను చేస్తున్నాడు. దృశ్యం 2 సినిమా రీమేక్ కోసం వెంకీ దాదాపుగా రెండు నెలల సమయంను కేటాయించాడు. ఇప్పటికే రీమేక్ షూటింగ్ దాదాపుగా సగం పూర్తి అయ్యిందంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లో చేసిన యూనిట్ సభ్యులు సెకండ్ షెడ్యూల్ ను కేరళలో ప్లాన్ చేశారంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
దృశ్యం 2 సెకండ్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ సభ్యులు అంతా కలిసి కేరళ చేరుకున్నారు. వెంకటేష్ మరియు ఇతర యూనిట్ సభ్యులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రీమేక్ ను సురేష్ బాబు తో కలిసి మలయాళం దృశ్యం 2 నిర్మాతలు నిర్మిస్తున్నారు. దృశ్యం లో మాదిరిగానే వెంకటేష్ కు జోడీగా ఈ సినిమా లో మీనా కనిపించబోతుంది. మొదటి పార్ట్ కంఏట మరింత ఆసక్తికరంగా దృశ్యం 2 ఉందని మలయాళ ప్రేక్షకుల నుండి టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగు దృశ్యం 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమ్మర్ చివరి వరకు విడుదల తేదీని యూనిట్ సభ్యులు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.