Begin typing your search above and press return to search.

పౌరాణిక పాత్రలో వెంకీ?

By:  Tupaki Desk   |   26 Aug 2017 4:36 AM GMT
పౌరాణిక పాత్రలో వెంకీ?
X
విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ ఈ మధ్య సెలక్టివ్ గానే సినిమాలు చేస్తున్నాడు. స్టోరీ బాగుంటే ఎలాంటి పాత్రకైనా సై అంటూ ఆ పాత్రలో ఒదిగిపోయి నటించడం వెంకటేష్ స్పెషాలిటీ. అందుకే అన్ని వర్గాల్లోనూ ఆయనకు అభిమానులున్నారు. ఈ మధ్య కాలంలో సాలా ఖడూస్ రీమేక్ గా వచ్చిన గురు సినిమాలో చివరగా వెండితెరపై కనిపించిన వెంకటేష్ ఆ తర్వాత ఇంతవరకు ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

వెంకటేష్ తన కెరీర్ లో విభిన్నమైన పాత్రలు ఎన్నో చేశాడు. కానీ ఆయన ఎప్పుడూ పౌరాణిక సినిమాలో నటించింది లేదు. తాజాగా ఆ ప్రయత్నం గుణశేఖర్ చేస్తున్నారు. రుద్రమదేవి సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఆయన భక్త ప్రహ్లాద మూవీని తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉంది. ఈ సినిమాలో హిరణ్య కశిపుడి పాత్రను వెంకటేష్ తో చేయించాలని గుణశేఖర్ అనుకుంటున్నారు. ఈ మధ్య వెంకటేష్ ను కలిసి స్టోరీ ఆయనకు నెరేట్ చేశారని తెలుస్తోంది. తన కెరీర్ లో ఎప్పుడూ పూర్తిస్థాయి పౌరాణిక పాత్ర చేసి ఉండకపోవడంతో వెంకటేష్ కూడా ఈ ప్రపోజల్ పై పాజిటివ్ గానే స్పందించారనేది ఇండస్ట్రీ టాక్. దీనికి హిరణ్యకశిప అనే టైటిల్ పెట్టాలని గుణశేఖర్ అనుకుంటున్నారని తెలుస్తోంది.

దగ్గుబాటి వారి వారసుడైన రానా కృష్ణం వందే జగద్గురుం సినిమాలో నరసింహస్వామి గెటప్ లో కనిపించాడు. రౌద్రంతో హిరణ్యకశిపుడి దాడి చేసి అతడిని అంతమొందించే పాత్రలో అద్భుతంగా నటించాడు. ఇప్పుడు హిరణ్య కశిపుడుడిగా వెంకటేష్ పాత్రను ఎలా తీర్చిదిద్దబోతున్నాడు.. దానికి వెంకటేష్ రెస్పాన్స్ ఏమిటనేది అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే.