Begin typing your search above and press return to search.
విశ్వక్ సేన్ సినిమాలో వెంకటేష్!
By: Tupaki Desk | 9 Aug 2022 5:31 AM GMTయంగ్ హీరో విశ్వక్ సేన్ ఎనర్జీ లెవల్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆన్ ది స్కీన్ అయినా..ఆఫ్ ది స్ర్కీన్ అయినా విశ్వన్ ఎనర్జీని మరో హీరో మ్యాచ్ చేయలేడు. యంగ్ హీరోలో అడిషనల్ క్వాలిఫికేషన్ అవకాశాల పరంగానూ కొంత వరకూ కలిసొస్తుందని చెప్పొచ్చు. అతని ఎననర్జీ కి ఏమాత్రం తగ్గని కథలతోనే సినిమాలు చేస్తున్నాడు.
'ఫలక్ నుమా దాస్'..'హిట్ ది ఫస్ట కేస్'..'పాగల్' అన్ని విశ్వక్ ఏనర్జీకి ఏమాత్రం తగ్గవు. విశ్వక్ లో ఆ వేగాన్ని తగ్గించి 'అశోక వనంలో అర్జన కళ్యాణం' సినిమా చేసి మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ఇందలో ఒకటి తమిళ రీమేక్ చిత్రం ఉంది. 'ఓ మై కడవులే' చిత్రాన్ని విశ్వక్ హీరోగా 'ఓరి దేవుడా' టైటిల్ తో రీమేక్ అవుతుంది.
మాతృకకు దర్శకత్వం వహించిన అశ్వత్ మర ముత్తునే ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఇందులో దేవుడు పాత్ర ఒకటుంటుంది. సినిమాలో ఆ పాత్ర చాలా కీలకం . మాతృకలో ఈ పాత్రని మక్కల్ సెల్వన్ విజయ్ సేతు పతి పోషించాడు. సేతుపతి ఆ పాత్ర పోషించడంతో సినిమా స్థాయి మారిపోయింది. సినిమా విజయంలో ఆ పాత్ర ఎంతో కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ కి ఆ పాత్రకి విక్టరీ వెంకటేష్ ని ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెంకీతో కథా చర్చలు పూర్తి చేసారుట. పాత్ర నచ్చడంతో వెంకేటష్ కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ అతిధి పాత్ర కోసం వెంకటేష్ మూడు రోజులు కాల్షీట్లు కేటాయించారుట. ఇప్పటికే వెంకటేష్ పార్ట్ మినహా చిత్రీకరణ అంతా పూర్తయిందని సమాచారం.
త్వరలోనే వెంకటష్ పాత్ర చిత్రీకరణ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. దీంతో షూట్ మొత్తం పూర్తవుతుంది. అటుపై పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి. అయితే వెంకటేష్ ఈ పాత్ర చేయడానికి అంగీకరించడానికి ప్రధానం కారణం విశ్వక్ సేన్ అని తెలుస్తోంది. దగ్గుబాటి ఫ్యామిలీతో విశ్వక్ మించి రిలేషన్ ఉంది.
ఆయన తొలి సినిమా 'ఫలక్ నుమా దాస్' రిలీజ్ వెనుక సురేష్ బాబు ఉన్నారు. ఆయన సంస్థ ద్వారా రిలీజ్ చేయకపోయినా వెనుకుండి సహకారం అందించారు. అప్పటి నుంచి వెంకటేష్..రానాలకి విశ్వక్ క్లోజ్ అయ్యాడు. విశ్వక్ ఎనర్జీని ఆ ఇద్దరు హీరోలు ఓ రేంజ్ లో మెచ్చుకుంటారు. ఆ రకంగా మరింత దగ్గరయ్యాడు విశ్వక్. ఇప్పుడా చనువు సహా సినిమాలో ఆ పాత్రకి స్కోప్ ఉంది కాబట్టి వెంకీ లాక్ అయినట్లు తెలస్తోంది.