Begin typing your search above and press return to search.
రైటర్ల జాబ్ కొట్టేస్తున్న స్టార్ హీరో
By: Tupaki Desk | 1 Dec 2019 4:57 AM GMTతమిళ్ లో విజయం సాధించిన అసురన్ ని తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు ఫ్యాన్స ధరకు ఈ సినిమా రైట్స్ ని దక్కించుకుని ప్లాన్ చేస్తున్నారు. ఈ రీమేక్ కు శ్రీకాంత్ అడ్డాలను దర్శకుడిగా ఎంపిక చేసారు. తాజాగా స్క్రిప్ట్ లో మార్పులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా వెంకటేష్ స్క్రిప్ట్ లో భారీగా మార్పులు కోరారట. దానికి సంబంధించిన పనులన్నింటిని వెంకీనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. తన విజన్ ని రచయితలు చేరుకోలేకపోవడంతో కొన్ని కొన్ని సన్నివేశాలను వెంకీనే స్వయంగా రాసుకుంటున్నాడుట.
అటుపై వాటిని పర్ఫెక్షన్ కోసం దర్శకరచయితలతోనే కరెక్షన్ చేయిస్తున్నారట. అయితే వెంకీ పట్టుదల చూస్తుంటే ఎలాంటి పొరపాటు జరగకూడదనే తపన ఆయనలో కనిపిస్తోందట. అసురన్ కథాంశం తెలుగు ఆడియన్స్ లో అన్ని వర్గాల కు కనెక్టయ్యేలా తీర్చిదిద్దాలనే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక రీమేక్ లలో వెంకటేష్ ది సుదీర్ఘ ప్రస్థానం. స్ట్రెయిట్ కథలతో పాటు.. రీమేక్ చిత్రాల్లోనూ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేసిన అనుభవం ఉంది. కెరీర్ లో 70 సినిమాలు చేశారు ఇప్పటికే. ఆన్ సెట్స్ తప్పొప్పులను సరిదిద్దగల సమర్ధత ఉంది. అందుకే అసురన్ కోసం తానే రైటర్ గా మారిపోయారట. ప్రస్తుతం సురేష్ బాబు రానాతో కలిసి అమెరికాలో ఉన్నాడు. ఆయన హైదరాబాద్ కు తిరిగి వచ్చే లోపు స్క్రిప్ట్ పనులు పూర్తిచేయాలని చూస్తున్నారట.
చివరిగా సురేష్ బాబు కి స్క్రిప్ట్ వినిపించి ఆయన ఒకే అంటే సెట్స్ కు వెళ్లడమే ఆలస్యం అంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పరంగా వెంకీ ఆధ్వర్యంలోనే మార్పులన్నీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సినిమా జయాపజయాలకు తనదే బాధ్యత అన్నంతగా ఎఫెర్ట్ పెట్టారని చెబుతున్నారు. ప్రస్తుతం వెంకటేష్ - నాగచైతన్య నటించిన వెంకీ మామ డిసెంబర్ లో రిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే.