Begin typing your search above and press return to search.
అసలైన అజ్ఞాతవాసి వెంకీనే
By: Tupaki Desk | 10 Jan 2018 10:54 AM GMTఅజ్ఞాతవాసి అంటే అసలు సిసలైన అర్ధం ఏంటి.. ఉనికిలో ఉన్నా కనిపించకపోవడమే అనే విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రానికి.. ఈ టైటిల్ ప్రకటించినప్పటి నుంచి.. ఈ పదం జనాలకు బాగానే కనెక్ట్ అయిపోయింది.
అయితే.. ఇప్పుడు సినిమా చూసిన జనాలు మాత్రం అసలు సిసలు అజ్ఞాతవాసి వెంకటేష్ అనుకుంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. సినిమా ప్రారంభంలో టైటిల్ కార్డ్స్ లోనే విక్టరీ వెంకటేష్ కు థ్యాంక్స్ కార్డ్ వేశారు. ఈ నేమ్ కార్డ్ చూడగానే.. సినిమాలో వెంకటేష్ అతిథి పాత్ర చేసి ఉంటాడని భావించారంతా. గతంలోనే ఈ క్యామియోపై న్యూస్ రావడం.. అజ్ఞాతవాసి సెట్స్ కు వెంకీ వచ్చిన కొన్ని స్టిల్స్ ఆన్ లైన్ లో కనిపించడం ఇందుకు బలం చేకూర్చింది. అయితే.. సినిమా అంతా చూసిన తర్వాత వెంకటేష్ కనిపించలేదేంటబ్బా అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. వెంకీ కనిపిస్తాడని అంచనాలు పెట్టుకుని.. చివరి వరకూ చూసినా.. ఎక్కడా ఈ విక్టరీ హీరో కనిపించలేదు. క్యామియో కాదు కదా.. రెప్పపాటు సన్నివేశంలో కూడా వెంకీ లేడు.
మరి వెంకటేష్ కు థ్యాంక్స్ కార్డ్ ఎందుకు వేసి ఉంటారనే సంగతి ఎవరికి అర్ధం కాలేదు. మూవీకి తెరవెనుక ఏదైనా సాయం చేసి ఉంటాడని.. అందుకే ఇలా కృతజ్ఞతలు చెప్పి ఉంటారని జనాలు వారికి వారే సమాధానపరచుకోవాల్సి వచ్చింది. క్యామియో లేకుండా టైటిల్ కార్డ్స్ లో ఉన్న వెంకీనే అసలైన అజ్ఞాతవాసి అనుకోవాల్సి వచ్చింది అభిమానులకు.