Begin typing your search above and press return to search.

మరో క్రికెట్‌ సినిమా లవ్‌ స్టోరీ మొదలు!

By:  Tupaki Desk   |   4 April 2022 5:03 AM GMT
మరో క్రికెట్‌ సినిమా లవ్‌ స్టోరీ మొదలు!
X
సినిమా ఇండస్ట్రీకి క్రికెట్ కి అవినాభావ సంబంధం ఉంది అనడంలో సందేహం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారితో క్రికెట్ లో ఉన్న వారికి సన్నిహిత సంబంధాలు కొనసాగుతూ ఉంటాయి. ఎంతో మంది హీరోయిన్స్ ను క్రికెటర్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదలుకుని అంతకు ముందు.. చాలా మంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

కొందరు ప్రేమించుకున్నారు గాని పెళ్లి పీటల వరకు వెళ్ళలేదు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్రికెటర్ల కు మరియు సినీ తారలకు ప్రేమ వ్యవహారం నడుస్తుంది అంటూ వార్తలు రెగ్యులర్‌ గా వార్తలు వస్తూ ఉంటాయి. ఆ వార్తల విషయం పక్కన పెడితే రెగ్యులర్ గా ఏదో ఒక లవ్‌ స్టోరీ కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా మరో సినీ క్రికెట్ ప్రేమ వ్యవహారం మొదలైనట్లుగా తాజా పరిస్థితులను గమనిస్తే అనిపిస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

అసలు విషయం ఏంటంటే విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన తెలుగు అమ్మాయి ప్రియాంక జవాల్కర్‌ మరియు వర్తమాన క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తో ప్రేమలో ఉందా అనే అనుమానాలు కలిగేలా వారి మధ్య ఈ వ్యవహారం నడుస్తోంది. ఇటీవల ప్రియాంక జవాల్కర్ ఇంస్టాగ్రామ్ లో హాట్ అండ్ క్యూట్ ఫోటో షూట్ లో షేర్ చేసింది.

ఆమె రెగ్యులర్ గా ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. కాని తాజాగా షేర్ చేసిన ఫోటోలకు క్రికెటర్ వెంకటేష్ కామెంట్ పెట్టడంతో అంతా కూడా ఆసక్తిగా అటు చూస్తున్నారు. వీరిద్దరి మధ్య ఏమైనా ఉందా.. ఏ క్షణంలోనైనా వీరిద్దరూ తాము ప్రేమించుకున్న ప్రకటిస్తారా అంటూ జనాలు మరియు మీడియా వర్గాల వారు ఎదురు చూస్తున్నారు.

ప్రియాంక జవాల్కర్ ఫోటో కు క్యూట్ అని వెంకటేష్ కామెంట్ పెట్టాడు అందుకు ఆమె విభిన్నంగా స్పందించింది. మీరు ఎవరు అన్నట్లుగా కామెంట్‌ పెట్టింది. ఎవరు తెలియకుండానే నువ్వు వెంకటేష్ ను ఫాలో అవుతున్నావా అంటూ కొందరు ఆమెను ప్రశ్నిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వీరిద్దరి మధ్య చాలా కాలంగానే వ్యవహారం నడుస్తుంది ఏమో అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇద్దరికీ సంబంధించి సోషల్ మీడియా అకౌంట్ లో ఒకరిని ఒకరు ఫాలో అవుతూ ఉన్నారు.. అది ఈ మధ్యన కానే కాదు.. చాలా కాలంగా వీరిద్దరూ ఒకరినొకరు సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న నేపథ్యంలో కచ్చితంగా వీరిద్దరి మధ్య వ్యవహారం కాస్త జోరుగానే.. స్పీడ్ గానే కొనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి