Begin typing your search above and press return to search.
వెంకీతో రానా గొడవలేంటి? అసలేం జరుగుతోంది?!
By: Tupaki Desk | 16 Oct 2022 4:12 AM GMTదగ్గుబాటి రామానాయుడు వారసుడిగా విక్టరీ వెంకటేష్ సినీ హీరో అయినా కానీ.. ఆయన పెద్ద కుమారుడు సురేష్ బాబు నిర్మాతగా స్థిరపడ్డారు. కానీ సురేష్ బాబు కొడుకు అయిన రానా కూడా నిర్మాతగా సెటిలవుతాడని టాక్ ఉండేది. కానీ తానొకటి తలిస్తే విధి వేరొకటి తలిచిన చందంగా రానా హీరో అయిపోయాడు. నాయుడు గారి మనవడు హీరో అయిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగాడు. రానా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోతున్నాడు. ఇక వెంకీ-రానా కాంబినేషన్ మూవీ గురించి దగ్గుబాటి అభిమానులు చాలా కాలంగా వేచి చూస్తున్నారు. ఆ కల నెరవేరే సమయం ఆసన్నమైంది.
విక్టరీ వెంకటేష్- రానా కాంబినేషన్ లో `రానా నాయుడు` అనే వెబ్ సిరీస్ తో అభిమానుల కోరిక తీరనుంది. ఇటీవలే టీజర్ ను విడుదల చేయగా ఆకట్టుకుంది. త్వరలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కోసం ఈ సిరీస్ అందుబాటులో ఉంటుంది. టీజర్ లో వెంకీ ఒక పెద్ద డాన్ గా కనిపించగా.. అతడితో ఫైట్ చేసే అధికారిగా రానా ట్విస్టిచ్చాడు. ప్రస్తుతం రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇద్దరు హీరోలు పరస్పరం సంభాషించారు. రానా - వెంకీ నడుమ ఆసక్తికర సంభాషణలు జరిగాయి. వీటిలో వెంకీ తనదైన శైలిలో ఫన్ ని కురిపించగా.. రానా దానిని కొనసాగించాడు.
వెంకీ ఈ సిరీస్ లో రానాకు తండ్రిగా కాన్ మన్ గా కనిపిస్తారని సమాచారం. తన తండ్రిని మరచిపోవడానికి నిరాకరించే పాత్రలో రానా కనిపించినా కానీ ఆ ఇద్దరి మధ్యా వైరం ఏమిటన్నది తెరపైనే చూడాలి. టీజర్ ట్రైలర్ ప్రకారం రానా - వెంకీ నడుమ కెమిస్ట్రీ ఒక రేంజులో వర్కవుటైంది. వెంకీ ఎన్నడూ లేనంత కొత్తగా ప్రయోగాత్మక పాత్రలో కనిపిస్తున్నారు. ఇక తాజా ఇంటర్వ్యూలో రానాను ఆఫ్ ద స్క్రీన్ ఎంతగానో ప్రేమిస్తానని తనని ఎవరూ ద్వేషించలేరని వెంకీ కాంప్లిమెంట్ ఇచ్చారు. రానా గురించి వెంకీ చెప్పిన ఈ మంచి మాటలు విన్న అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు. ఇక బాబాయ్ వెంకటేష్ అంటే రానాకు కూడా అంతే గొప్ప అభిమానం. దానిని అతడు ఎప్పుడూ దాచుకోలేదు.