Begin typing your search above and press return to search.
వెంకీ కూడా మేకోవరే అన్నమాట
By: Tupaki Desk | 28 Feb 2016 4:25 AM GMTవిక్టరీ వెంకటేష్ కొన్నేళ్లుగా ఒకే రకమైన లుక్ తో దర్శనమిస్తున్నాడు. ఆయన గత రెండు సినిమాలే తీసుకుంటే.. దృశ్యం - గోపాల గోపాల చిత్రాల్లో కాస్ట్యూమ్స్ లో తేడా ఉంటుంది కానీ.. వెంకీ లుక్ లో పెద్దగా మార్పుండదు. మారుతి దర్శకత్వంలో చేస్తున్న లేటెస్ట్ మూవీలోనూ మామూలుగానే కనిపించేట్లున్నాడు వెంకీ. మేకింగ్ ఫొటోస్ చూస్తుంటే ఆ సంగతి అర్థమవుతోంది. ఐతే తన తర్వాతి సినిమాకు మాత్రం వెంకటేష్ పూర్తిగా సరికొత్త లుక్ తో కనిపించబోతున్నాడట. ఆ సినిమా వెంకీకి కంప్లీట్ మేకోవర్ అని అంటున్నారు.
కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ‘సాలా ఖడూస్’ రీమేక్ లో నటించడానికే రెడీ అవుతున్నాడట వెంకీ. మాతృకకు దర్శకత్వం వహించిన సుధా కొంగరనే తెలుగులోనూ డెరెక్ట్ చేయనుంది. ఇప్పటికే స్క్రిప్టు చర్చలు పూర్తయ్యాయి. మూడు నెలల్లో సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి. ఐతే ఇంకో నెల రోజుల్లోనే మారుతి సినిమా పూర్తి చేసేయబోతున్న వెంకీ.. ఆ వెంటనే సాలా ఖడూస్ రీమేక్ కోసం కసరత్తులు మొదలుపెట్టబోతున్నాడు. మాధవన్ తరహాలోనే రఫ్ - రగ్డ్ లుక్ లోకి మారిపోనున్నాడట వెంకీ. విక్టరీ హీరోకు మామూలుగానే మంచి బాడీ ఉంది. మాధవన్ లాగా మరీ ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. ఐతే బాగా కష్టపడి మాధవన్ కంటే కూడా రఫ్ గా, చిజిల్డ్ బాడీతో కనిపించాలని వెంకీ భావిస్తున్నాడట. కాబట్టి కొన్ని నెలల తర్వాత వెంకీ సరికొత్త అవతారంలో దర్శనమివ్వడం ఖాయం.