Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ - వెంకీల గౌతమిపుత్ర మిస్ అయ్యాం
By: Tupaki Desk | 31 May 2021 2:55 AM GMTఇండస్ట్రీలో చాలా సినిమాలు ప్రకటించిన తర్వాత క్యాన్సిల్ అవ్వడం లేదా చర్చల దశలోనే నిలిచి పోవడం వంటివి జరుగుతూనే ఉంటాయి. చరిత్రలో ఎన్నో అరుదైన కాంబో సినిమాలు నిలిచి పోయిన దాఖలాలు ఉన్నాయి. అందులో ఒకటి సీనియర్ ఎన్టీఆర్ మరియు వెంకటేష్ ల మూవీ కూడా ఉంది. వెంకటేష్ అప్పుడప్పుడే హీరోగా గుర్తింపు దక్కించుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ తో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా లో నటించేందుకు చర్చలు జరిగాయి. ఎన్టీఆర్ కు చాలా ఇష్టమైన గౌతమిపుత్ర శాతకర్ణి కథతో సినిమా రూపొందించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. షూటింగ్ కు వెళ్లాలని భావిస్తున్న సమయంలో రాజకీయాలతో అన్నగారు ఎన్టీఆర్ బిజీ అయ్యారు.
ఆ సమయంలో అనుకున్న దాని ప్రకారం శాతకర్ణిగా ఎన్టీఆర్ నటించాల్సి ఉండగా ఆయన తనయుడు పులమావి గా వెంకటేష్ నటించాల్సి ఉంది. తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ మరియు వెంకటేష్ లు నటిస్తే చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కలేదు. శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమా కంటే ముందే ఈ మల్టీ స్టారర్ ను ఎన్టీఆర్ అనుకున్నారు. కాని అప్పటి పరిస్థితులు అనుకూలించలేదు అంటూ సీనియర్ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ఎన్టీఆర్ చేయాలనుకున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను చేయలేక పోయినా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ తన వందవ సినిమాగా క్రిష్ దర్శకత్వంలో చేశాడు. బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. బాలయ్య కెరీర్ లో ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు తండ్రి చేయలేని పాత్రను చేశాననే సంతృప్తి ఆయనకు దక్కింది. గౌతమిపుత్ర శాతకర్ణిలో బాలయ్య సోలో హీరోగా చేశాడు. ఆయన విజయాలను మాత్రమే చూపించాడు. కొడుకు కు సంబంధించి ఎలాంటి కథను పెద్దగా చూపించలేదు.