Begin typing your search above and press return to search.

వెంకీ ఆయ‌న‌కీ ఓకే చెప్పేశాడ‌ట‌!

By:  Tupaki Desk   |   17 July 2015 10:40 AM IST
వెంకీ ఆయ‌న‌కీ ఓకే చెప్పేశాడ‌ట‌!
X
జూన్‌లో రెండు సినిమాలు ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పాడు వెంక‌టేష్‌. ఇప్పుడు జులై చివ‌రికి వ‌చ్చేస్తున్నాం. అయినా ఇంకా వెంకీ సినిమాల విష‌యంలో స్ప‌ష్ట‌త రాలేదు. క‌థ‌ల విష‌యంలో ఆయ‌న క‌స‌ర‌త్తులు చేస్తూనే ఉన్నాడు. అయితే కాస్త ఆల‌స్య‌మైనా చెప్పినట్టుగానే లాటుగా రెండు మూడు సినిమాలు ప్ర‌క‌టించే అవ‌కాశాలున్న‌ట్టు రామానాయుడు స్టూడియో వ‌ర్గాలు చెబుతున్నాయి. చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్ ఓ చిత్రం చేయ‌బోతున్నార‌ని ఆమ‌ధ్య వినిపించింది. నిజానికీ ఈ కాంబినేష‌న్‌లో సినిమా గురించి కొన్నేళ్ల నుంచి మాట్లాడుకొంటున్నారు. అయితే ఎంత‌కీ ఆ ప్రాజెక్టు ఓకే అవ్వ‌డం లేదు. ఈసారి మాత్రం వెంకీ, యేలేటి క‌చ్చితంగా క‌లిసి సినిమా చేస్తార‌నే మాట వినిపిస్తోంది. అయితే దీంతో పాటు `ఓన‌మాలు, `మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు` చిత్రాల‌తో గుర్తింపు తెచ్చుకొన్న క్రాంతి మాధ‌వ్‌తోనూ వెంకీ ఓ సినిమా చేస్తార‌ని తాజా స‌మాచారం.

ఇటీవ‌లే క్రాంతి మాధ‌వ్ చెప్పిన క‌థ విని సురేష్‌బాబు ఫ్లాటైపోయార‌ట‌. వెంట‌నే ఆయ‌న్ని వెంకీ ద‌గ్గ‌ర‌కు పంప‌డం, ఆయ‌న‌కూడా ఓకే చెప్ప‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయ‌నీ.. ఈ సినిమా గురించి త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డొచ్చ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. `దృశ్యం`, `గోపాట గోపాల‌` చిత్రాల‌తో వ‌రుస‌గా విజ‌యాలు అందుకొన్నాడు వెంకీ. ఆ ప‌రంప‌ర‌ని కొన‌సాగించేలా మంచి క‌థ‌ల్నే ఎంచుకోవాల‌నేది ఆయ‌న ప్లానింగ‌ట‌. ఆ మేర‌కు ఆచితూచి అడుగులేస్తున్నాడు. వెంకీ సినిమాల గురించి నాలుగైదు రోజుల్లోనే రామానాయుడు స్టూడియో నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డొచ్చ‌ని స‌మాచారం.