Begin typing your search above and press return to search.

ఏడాది తర్వాత మళ్లీ వార్తల్లో 'ఎఫ్‌ 3'

By:  Tupaki Desk   |   2 Jan 2020 12:40 PM GMT
ఏడాది తర్వాత మళ్లీ వార్తల్లో ఎఫ్‌ 3
X
వెంకటేష్‌ సుదీర్ఘ కాలం తర్వాత 'ఎఫ్‌ 2' చిత్రంతో ఫామ్‌ లోకి వచ్చాడు. అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్‌ 2 చిత్రంలో వరుణ్‌ తేజ్‌ తో కలిసి వెంకటేష్‌ నటించిన విషయం తెల్సిందే. ఒక చిన్న చిత్రంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా దాదాపుగా వంద కోట్ల వసూళ్లను రాబట్టిందని ట్రేడ్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. వెంకీ మళ్లీ ఫామ్‌ లోకి రావడంతో ఆయన అభిమానులు ఆనందంగా ఉన్నారు. వెంకీమామ చిత్రంతో మరో విజయాన్ని సొంతం చేసుకున్న వెంకటేష్‌ త్వరలో అసురన్‌ చిత్రం రీమేక్‌ లో నటించబోతున్నాడు.

ఇటీవల విడుదలైన వెంకీమామ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా వెంకటేష్‌ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తన ప్యూచర్‌ ప్లాన్స్‌ పై క్లారిటీ ఇచ్చాడు. గత ఏడాది వచ్చిన 'ఎఫ్‌ 2' చిత్రానికి ఖచ్చితంగా సీక్వెల్‌ ఉంటుందని ప్రకటించాడు. గత ఏడాది ఎఫ్‌ 2 చిత్రం థియేటర్‌ లలో ఉన్న సమయంలోనే ఎఫ్‌ 3 చిత్రం తీస్తామంటూ యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ విషయాన్ని అంతా మర్చి పోయారు. చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా మర్చి పోయి ఉంటారనుకున్నారు. కాని తాజాగా వెంకటేష్‌ ఎఫ్‌ 3 చిత్రం ఉందని ప్రకటించాడు.

ఎఫ్‌ 2 సీక్వెల్‌ లో తాను వరుణ్‌ కలిసి నటించబోతున్నట్లుగా చెప్పాడు. అయితే స్క్రిప్ట్‌ ఎలా ఉంటుంది అనే విషయమై వెంకటేష్‌ క్లారిటీ ఇవ్వలేదు. ఎఫ్‌ 2 లో నటించిన హీరోయిన్స్‌ మాత్రం ఉండక పోవచ్చు అని కూడా వెంకీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అనీల్‌ రావిపూడి 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం విడుదల కార్యక్రమాల్లో ఉన్నాడు. సంక్రాంతికి ఆ సినిమా పూర్తి అయిన తర్వాత ఎఫ్‌ 3 స్క్రిప్ట్‌ పనులు మొదలు పెట్టే అవకాశం ఉందేమో చూడాలి. మొదటి పార్ట్‌ ను పూర్తి ఎంటర్‌ టైన్‌ మెంట్‌ తో తెరకెక్కించిన అనీల్‌ రావిపూడి ఎఫ్‌ 3 ని ఎలా చూపిస్తాడో..!