Begin typing your search above and press return to search.
వెంకీ గురువుల గురించి ఏం చెప్పాడంటే?
By: Tupaki Desk | 6 Sep 2016 4:51 AM GMTనిన్న రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో టీచర్స్ డేని సెలబ్రేట్ చేసుకొన్న విధానంపైనే అందరూ చర్చించుకొన్నారు. ఆ హడావుడిలో కథానాయకుడు వెంకటేష్ గురువుల గురించి చెప్పిన మాటలు మాత్రం పెద్దగా ఎవ్వరూ చెవికెక్కించుకోలేనట్టుంది. వెంకటేష్ నిన్న ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గురువుల గురించి గొప్పగా చెప్పాడు. జీవితంలో హ్యాపీగా ఉండటానికీ ఓ గురువు కావాలని చెప్పుకొచ్చాడు. ఆ గురువుకి `నీలోనూ ఓ దేవుడు ఉన్నాడని శిష్యుడికి చెప్పేంత ధైర్యం` ఉండాలన్నాడు. నేనలాంటి గురువులతోనే ట్రావెల్ చేస్తున్నానని, అందుకే హ్యాపీగా ఉండగలుగుతున్నానని స్పష్టం చేశాడు.
నేనే దేవుడిని - నువ్వు కాదు అని చెప్పే గురువుని మాత్రం నమ్మకండని చెబుతున్నాడు. ``చిన్నప్పుడు క్లాస్ రూమ్ లో గురువులు కొన్నిసార్లు స్నేహితులుగా - కొన్నిసార్లు శత్రువులుగా కనిపించేవాళ్లు. కానీ వాళ్లు నేర్పించినవన్నీ నలుగురిలో ఎలా బతకాలో చెప్పాయి. ఎలా సంతోషంగా ఉండాలనేది మాత్రం వేరే గురువులు చెప్పారు. ఆ గురువులు ఎవరో కాదు.. మహమ్మద్ ప్రవక్త - జీసస్ - రామకృష్ణ పరమహంస - వివేకానంద - రమణమహర్షి. వాళ్ల బోధనలే నాపై ప్రభావం చూపాయి. వాళ్ల భావనల్లోనే నేను బతుకుతుంటా. అద్వైత బోధనలవల్లే నేనింత సంతోషంగా ఉండగలుగుతున్నా. వాళ్లంతా కూడా ఒకప్పుడు మనుషులే. కానీ వాళ్లలోని దేవుడిని బయటికి తీసుకొచ్చి చూపారు. మనం కూడా అదే చేయాలి. అలా చేయాలంటే వాళ్ల దారిలో మనం నడవాలి`` అని చెప్పుకొచ్చాడు వెంకీ. ఈ మాటలన్నీ వింటుంటే వెంకీలోనూ ఓ గొప్ప గురువు ఉన్నాడనిపిస్తోంది కదూ!