Begin typing your search above and press return to search.
అమ్మాయిలు మహేష్ లుంగీ ఇంకాస్త లేపితే బాగుండు అనుకున్నారట!
By: Tupaki Desk | 16 Jan 2020 11:12 AM GMTసంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు సినిమాను విభిన్నంగా ప్రమోట్ చేసేందుకు ప్రయత్నించాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు అనీల్ రావిపూడి మరియు మహేష్ బాబులను స్టార్ హీరో వెంకటేష్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. మహేష్ బాబు గురించి వెంకటేష్ మాట్లాడిన మాటలు.. వారిద్దరి మద్య సరదా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా వెంకటేష్ మాట్లాడుతూ మహేష్ బాబు లుంగీ డాన్స్ పై హాట్ కామెంట్స్ చేశాడు. మైండ్ బ్లాంక్ సాంగ్ లో మహేష్ బాబును చూసిన ఆడవారు ఔట్ అవుతున్నారు. సాదారణంగా అంతా హీరోయిన్స్ ను ఎలా అయితే పొట్టి డ్రస్ లు వేసుకుంటే చూస్తారో అలా మైండ్ బ్లాంక్ పాటలోని మహేష్ బాబును ఆడవారు అలా చూస్తున్నారు. మహేష్ బాబు లుంగీ ఇంకాస్త పైకి ఎత్తితే బాగుండు.. ఆయన కాళ్లు కనిపించేవి అనుకుంటున్నారని వెంకటేష్ సరదాగా కామెంట్స్ చేశాడు. మైండ్ బ్లాంక్ పాటకు మహేష్ మంచి స్టెప్స్ వేశాడని వెంకీ కితాబిచ్చాడు.
మైండ్ బ్లాంక్ పాట గురించి మహేష్ బాబు మాట్లాడుతూ.. ఒక మంచి మాస్ మసాలా సాంగ్ ను చేయాలని మొదటే నిర్ణయించుకున్నాం. ఈ పాటను వీరు డిజైన్ చేసినప్పుడు నాకు బాగా నచ్చింది. దీనిని శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో చేశాం. రెండు మూడు షాట్స్ చేసిన తర్వాత అనీల్ సూపర్ గా వచ్చిందండి. కాస్త ఎక్స్ ప్రెషన్స్ విషయంలో కూడా వైవిధ్యం ప్రదర్శిస్తే బాగుంటుందని చెప్పాడు. అప్పుడు నేను కొత్తగా ప్రయత్నించాను. దాంతో పాటు స్థాయి మరింత పెరిగిందని మహేష్ బాబు అన్నాడు. నా 20 ఏళ్ల సినీ కెరీర్ లో ఈ పాటకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఎప్పుడు అందుకోలేదని మహేష్ బాబు అన్నాడు.