Begin typing your search above and press return to search.

ఆడియో లేదు బంగారం.. ఒక ట్రాక్ అంతే

By:  Tupaki Desk   |   5 July 2016 5:30 PM GMT
ఆడియో లేదు బంగారం.. ఒక ట్రాక్ అంతే
X
విక్టరీ వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న బాబు బంగారం ముూవీ షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఈ మధ్యన నయనతార డేట్స్ విషయంలో ఏదో ఇబ్బంది వచ్చిందనే టాక్ వినిపించింది కానీ.. దాన్ని సామరస్యంగానే పరిష్కరించేసుకుంది యూనిట్. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన అన్ని వర్క్స్ పూర్తయిపోగా.. కేవలం ఒక పాటను తెరకెక్కిస్తే చాలని తెలుస్తోంది. దీని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలుపెట్టనున్నారు.

జూలై 9న బాబు బంగారం ఆడియో రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించిన యూనిట్.. ఇప్పుడ ఆడియో ఫంక్షన్ వాయిదా పడినట్లు ప్రకటించింది. ఇందుకు కారణాలు చెప్పలేదు కానీ.. ఆ రోజున ఒక ట్రాక్ ను మాత్రం రిలీజ్ చేస్తామని తెలిపింది. గిబ్రాన్ సంగీతం అందిస్తుడడంతో.. ఈమూవీ సాంగ్స్ పై ఇప్పటికే మంచి అంచనాలే ఉన్నాయి. అయితే.. ఇలా ఆడియో వాయిదా వేయడం వెనుక.. సినిమాను పోస్ట్ పోన్ చేసే ప్రణాళిక కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు కబాలి మూవీ జూలై 22న వస్తుండడంతో.. జూలై 29న బాబు బంగారం విడుదల చేయడం సరికాదని అనుకుంటున్నారట యూనిట్.

నయనతార హీరోయిన్ గా రూపొందుతున్న బాబు బంగారం టీజర్‌ ఇప్పటికే మాంచి హల్‌ చల్‌ చేస్తోంది. దానితో ఇప్పుడు సినిమా కాస్త లేటైనా కూడా పెద్దగా వర్రీ కావక్కర్లేదని మారుతి అండ్ కో అనుకుంటున్నారట. కాకపోతే జనాలు ఆ టీజర్‌ పవర్‌ ను మర్చిపోయేలోపే మరొక ట్రీట్‌ ఏదైనా ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. అందుకే ఈ సాంగ్‌ రిలీజ్‌. అది సంగతి.