Begin typing your search above and press return to search.
రెండూ మిక్సింగ్ ఉండాలంటున్న వెంకీ
By: Tupaki Desk | 29 March 2017 4:14 AM GMTవెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన గురు చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. స్పోర్ట్స్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీలో.. వెంకీ గెటప్ నుంచి అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా.. విక్టరీ వెంకటేష్ చేస్తున్న ఓ స్పెషల్ మూవీ గురు.
అయితే.. తమిళ్ సాలాఖద్దూస్ కి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే. గతంలో పలు రీమేక్ సినిమాల్లో నటించిన వెంకటేష్.. మళ్లీ ఓ రీమేక్ ను ఎంచుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. 'రీమేక్ మూవీని ఎంచుకోవడంలో స్టోరీ.. కేరక్టర్ రెండింటికీ ప్రాధాన్యత ఉంటుంది. రెండూ సమపాళ్లలో మిక్స్ అయితేనే.. ఆ మూవీ పండుతుంది. ఎలా చూసినా.. సినిమా అనేది ఒక బిజినెస్. అలాంటపుడు సేఫ్ జోన్ లో ఉండేందుకు ప్రయత్నించాలి. ప్రతీ సినిమాకి ఎమోషన్స్ ఉంటాయి. వాటిని ఆడియన్స్ కు కనెక్ట్ చేయగలిగితే సక్సెస్ సాధించగలుగుతాం. ఈ పాత్ర కోసం నేను ఎక్కువ టైం తీసుకోలేదు. గతంలో 6 నెలల పాటు నేను బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాను. అందుకే త్వరగానే కనెక్ట్ అయిపోయాను' అని చెప్పారు వెంకటేష్.
ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని అంటూ ఉంటారని.. అయితే తాను మాత్రం జనాలు సినిమాలు చూసే విధానంలో మార్పు వచ్చిందని నమ్ముతానని చెప్పారు వెంకీ. అలాగే తనకు గేమ్ షోస్ చేసే ఆలోచన కానీ.. మూవీ డైరెక్షన్ చేసే ఆలోచన కానీ లేవని తేల్చేశారు గురు వెంకటేష్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/