Begin typing your search above and press return to search.

వెంకీ - పవన్.. మాటలు అవేనా?

By:  Tupaki Desk   |   20 Dec 2017 4:43 PM GMT
వెంకీ - పవన్.. మాటలు అవేనా?
X
అభిమాన హీరోలు ఫ్రెండ్లిగా ఉంటే వారి ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాడం కొంచెం కష్టమే. అయితే చాలా మంది హీరోలు ఎంతో స్నేహంగా ఉన్నా కూడా కలిసి నటించడానికి అంతగా ఆసక్తి చూపారు. అందుకు అనేక కారణాలు లేకపోలేవు. ఒక హీరో ముందు మరో హీరో రేంజ్ తగ్గితే అభిమానులు ఏ మాత్రం తట్టుకోలేరు. కానీ వెంకటేష్ లాంటి హీరోస్ మాత్రం మల్టీస్టారర్ సినిమాల్లో తన పాత్ర కొంచెం కథకు తగ్గట్టు నెగిటివ్ గా ఉన్నాసరే ఏ మాత్రం లెక్కచేయాడు. వెంటనే ఒప్పుకుంటాడు.

ఇక అసలు విషయానికి వస్తే వెంకటేష్ చేసినట్టుగా ఈ మధ్య కాలంలో ఏ హీరో అన్ని మల్టీస్టారర్ కథల్లో నటించలేదన్న విషయం అందరికి తెలిసిందే. అంతే కాకుండా వెంకీ కొన్ని కథల్లో అతిధి పాత్రలు చేయడానికి కూడా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు అజ్ఞాతవాసి సినిమాలో కూడా వెంకీ పవన్ కోసం ఒక ప్రత్యేక పాత్ర చేశారట. ప్రస్తుతం ఆ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. ఆ న్యూస్ త్రివిక్రమ్ ఏ మాత్రం బయటపెట్టలేదు. చాలా గోప్యంగా ఉంచుతున్నారు. అయితే సినిమాలో వీరిద్దరికి సంబంధించిన డైలాగ్ కూడా ఇదేనని ఒక టాక్ వినిపిస్తోంది.

పవన్ క్యారెక్టర్ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెంకీ వచ్చి..తమ్ముడు నీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే పవన్ కళ్యాణ్ ని ఆడగచ్చు కదా అన్న ప్రశ్నకు కు పవన్ క్యారెక్టర్.. పవన్ కల్యాణ్ కే ప్రాబ్లమ్స్ ఉన్నాయి.. ఇంక నా ప్రాబ్లమ్స్ ఏం సాల్వ్ చేస్తాడు అని సమాధానం ఉంటుందట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ప్రస్తుతం పవన్ అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యిందని తెలుస్తోంది. అయితే ముందే వెంకీ క్యారెక్టర్ గురించి చెబుతామని చిత్రయూనిట్ లోని కొందరు చర్చించుకున్నారట. కానీ పవన్ ఆ విధమైన పబ్లిసిటీ వద్దని కూల్ గా ఆడియెన్స్ కి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పాడట. అది సంగతి.