Begin typing your search above and press return to search.

వెంకీకి భ‌ర‌త్ తెగ న‌చ్చేశాడు

By:  Tupaki Desk   |   26 April 2018 9:52 AM GMT
వెంకీకి భ‌ర‌త్ తెగ న‌చ్చేశాడు
X
భ‌ర‌త్ అను నేను చూసిన వాళ్లంద‌రూ ఆ సినిమాను పొగ‌డ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. అబ్బ‌బ్బా ఏం తీశారు... మ‌హేష్ బాబు ఏం చేశాడు అంటూ ఒక‌టే పొగ‌డ్త‌లు. అలా పొగిడేవారి జాబితాలోకి సీనియ‌ర్ హీరో వెంకీ కూడా చేరిపోయాడు. సినిమా చూసి ఆగ‌లేక పొగిడేస్తూ త‌న సోష‌ల్ మీడియాలో పోస్టులు చేశాడు. ఇప్ప‌టికే ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు భ‌ర‌త్‌ను తెగ మెచ్చుకున్నారు.

సోష‌ల్ మీడియాలో వెంకీ అంతా చురుకుగా ఉండ‌డు. అలాంటి వ్య‌క్తి కూడా భ‌ర‌త్ అను నేను సినిమాను పొగుడుతూ పోస్టు పెట్టాడు. భ‌ర‌త్ సినిమా చూశాన‌ని మ‌హేష్ బాబు అద్భుతంగా చేశాడ‌ని మెచ్చ‌కున్నాడు. కొర‌టాల శివ చాలా సెన్సిబుల్ విష‌యాన్ని అందంగా తెర‌కెక్కించార‌ని ప్ర‌శంసించారు. డివివి దాన‌య్య‌గారితో పాటూ మొత్తం టీమ్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. రెండు రోజుల క్రితం రామ్ చ‌ర‌ణ్ కూడా భ‌రత్‌న తెగ పొగిడేశాడు. మహేష్ బాబు పవర్ ఫుల్ ఫెర్మామెన్స్ చేశాడని కొరటాల శివ కథను అద్భుతంగా తెరకెక్కించాడన్నారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్‌ ఎంతో ఎంజాయ్ చేశానన్నాడు. మంచి సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమైన కైరాకు అభినంద‌న‌లు అని ట్వీట్ చేశాడు.

ప్ర‌స్తుతం హీరో వెంక‌టేష్ ఓ మల్టీస్టార‌ర్ సినిమాలో న‌టిస్తున్నాడు. మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో ఎఫ్‌2 అనే సినిమాలో క‌నిపించ‌బోతున్నాడు. ఇందులో వెంకీ స‌ర‌స‌న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. అస‌లే ముదురు హీరో అయిన వెంకీ ప‌క్క‌న లేత చిగురాకు లాంటి త‌మ‌న్నా సెట్ అవ్వ‌దేమో అన్న కామెంట్లు ఫిల్మ్ న‌గ‌ర్లో జోరుగానే వినిపించాయి. త‌మ‌న్నాకు తెలుగులో అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో వెంకీతో సినిమాకు ఒప్పుకుంద‌ని అంటున్నారు. వెంకీ- త‌మ‌న్నా జోడి వెండి తెరపై ఎలా ఉంటుందో చూడాలి. గ‌తంలో త‌మ‌న్నా మ‌హేష్ బాబుతో ఆగ‌డు సినిమా చేసింది.