Begin typing your search above and press return to search.
అన్న కొడుకు ఎంట్రీకి సలహాలు.. తన కొడుకు ఎంట్రీపై క్లారిటీ
By: Tupaki Desk | 18 July 2021 3:30 PM GMTవెంకటేష్ హీరోగా నటించిన రెండు సినిమాలు ఓటీటీ ద్వారా విడుదలకు సిద్దం అయ్యాయి. చాలా మంది విమర్శలు చేస్తూ ఉన్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ విడుదలకు వెళ్లక తప్పడం లేదు అంటూ నిర్మాత సురేష్ బాబు ప్రకటించాడు. ఈ వారంలో నారప్ప సినిమా తో వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. నారప్ప సినిమా ప్రమోషన్ లో భాగంగా వెంకటేష్ మీడియా ముందుకు వచ్చాడు. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన వెంకటేష్ పలు విషయాలపై స్పందించాడు. తన వ్యక్తిగత విషయాల నుండి మొదలుకుని ఓటీటీ ఎంట్రీ వరకు అనేక విషయాలను ఆయన మీడియాతో చర్చించాడు.
సురేష్ బాబు తనయుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు కదా మీరు ఏమైనా సలహాలు ఇస్తున్నారా అంటూ ప్రశ్నించగా.. క్రమ శిక్షణ చిత్తశుద్ది ఉన్న వారు తప్పకుండా సక్సెస్ అవుతారు. అవే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఆ రెంటికి అదృష్టం తోడైతే తప్పకుండా విజయాలు దక్కుతాయి. కష్టపడి పని చేసే వారికి.. చేస్తున్న పని పట్ల నిబద్దత ఉన్న వారికి ఖచ్చితంగా ఆఫర్లు వస్తూనే ఉంటాయి. అయితే సక్సెస్ కోసం నిర్ణీత కాలం అస్సలు పెట్టుకోవద్దు. అవకాశాలు.. సక్సెస్ లు వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. కష్టపడుతూ ఉన్న సమయంలో ఏదో ఒక సందర్బంలో సక్సెస్ దక్కుతుందని అభిరామ్ కు సూచించాడు.
ఇక తన కొడుకు అర్జున్ ను హీరోగా పరిచయం చేసే ఉద్దేశ్యం నాకు లేదు అన్నాడు. ప్రస్తుతానికి ఆ విషయంలో తాము ఆలోచన చేయడం లేదు. చదువుకోవడం కోసం త్వరలో అమెరికా వెళ్తున్నాడు. అక్కడ అతడు జీవితాన్ని నేర్చుకుంటాడని నేను అనుకుంటున్నాను. చాలా సింపుల్ గా ఉండటం అర్జున్ కు ఇష్టం. అర్జున్ ఎక్కడ కూడా నేను పలానా అని చెప్పుకోడు. తన గురించి బయటకు తెలియకూడదు అనే ఉద్దేశ్యంతో సినిమాల వేడుకలకు కూడా బయటకు రాడు. అందుకే తను సినిమాల్లోకి వస్తాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేను అన్నాడు.