Begin typing your search above and press return to search.
#అరణ్య.. రానా నటనతో ఆశ్చర్యపరిచాడు!-వెంకీ
By: Tupaki Desk | 21 March 2021 11:32 AM GMTతన అద్భుత నటనతో రానా నన్ను ఆశ్చర్యపరిచాడని కాంప్లిమెంట్ ఇచ్చారు విక్టరీ వెంకటేష్. రానా నటించిన అరణ్య మార్చి 26 న విడుదలవుతోంది. ప్రభు సోలమన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్- శ్రియా పిల్గావ్కర్- జోయా హుస్సేన్ తదితరులు నటించారు. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. శేఖర్ కమ్ముల- వెంకటేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వెంకటేష్ మాట్లాడుతూ- “నేను లీడర్ .. బాహుబలి.. ఘాజీ వంటి చిత్రాలలో రానా నటనను చూశాను. అతను నటుడిగా నేర్చుకుంటూ ఎదుగుతున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. నిన్న రాత్రి అరణ్య సినిమా చూసినప్పుడు నాకు మాటలు పోయాయి. తన నటనతో రానా నన్ను అంతగా ఆశ్చర్యపరిచాడు. అతను తన పాత్రలో జీవించాడు. అతని హార్డ్ వర్క్ అంతా ఈ చిత్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అరణ్యలో అడవులను రక్షించాలన్న ముఖ్యమైన సందేశం ఉంది. ప్రజలు కూడా దీన్ని ఇష్టపడతారని నేను ఆశిస్తున్నాను” అన్నారు.
అరణ్య సినిమా మనం అందరం గర్వపడేలా ఉంది. ఇండియన్ స్క్రీన్‌పై ఓ సరికొత్త పాత్రను రానా చేశాడు. ఇలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకున్న రానాను అభినందిస్తున్నాను. రానా బాడీ లాంగ్వేజ్ కూడా పాత్రకు సరిపోయింది. అడవి లొకేషన్స్‌లో షూటింగ్ చేయడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా జంతువుల హవాభాలను కెమెరాలో షూట్ చేయడం కష్టం. కానీ దర్శకుడు ప్రభు సాల్మన్ అండ్ టీమ్ చాలా కష్టపడి తీశారు.. అని వెంకీ తెలిపారు.
ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మించింది. శాంతను మొయిట్రా సంగీతం అందించారు. ఈ చిత్రం మార్చి 26 న తెలుగు- తమిళం- హిందీ భాషల్లో విడుదల కానుంది.