Begin typing your search above and press return to search.
మూర్ఖ మానవా నీలోనే దేవుడున్నాడు -వెంకీ
By: Tupaki Desk | 6 July 2015 7:29 AM GMTవివేకానందుడికి పక్కా శిష్యుడిలా మాట్లాడాడు వెంకీ. టాలీవుడ్‌లో ఆధ్యాత్మిక భావజాలం నిండుగా ఉన్న హీరోగా వెంకటేష్‌కి పేరుంది. వీలున్నప్పుడల్లా భక్తి, ముక్తి, రక్తికి సంబంధించిన సూక్తుల్ని బహింరంగ వేదికలపైనా చెబుతుంటాడు. అయితే ఇటీవలి కాలంలో అమెరికాలో తానా, నాటా ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో వెంకీ ఒకానొక సందర్భంలో ఆధ్యాత్మికత, ముక్తి గురించి అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు. ఎన్నారైల కరతాళ ధ్వనుల మధ్య వెంకీ చెప్పిన సూక్తులు అందరినీ ఆలోచింపజేశాయి.
'ఎన్నారైలు తమ జీవితాల్లో ఎంతో సక్సెస్ సాధించినా, ఇంకా వారిలో అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. నిజానికి అసంతృప్తి మనిషికి శత్రువు. గతం గురించి, భవిష్యత్ గురించి ఆలోచించే కంటే ఇప్పటిగురించి ఆలోచించడమే ముక్తి మార్గం. నువ్వేంటో నువ్వే తెలుసుకో. పక్కవారి ఎదుగుదల గురించి ఆలోచించకు. అప్పుడే ముక్తి మార్గానికి చేరువవుతారు.. అంటూ చెప్పుకొచ్చాడు. యోగా, స్పిరిట్యువల్ సైన్స్ గురించి తెలుసుకుంటే నీకు నువ్వే గాడ్ అవుతావ్. తెలుసుకో అంటూ వెంకీ ఎన్నారైలను నిద్ర లేపాడు. దేవుళ్లు, మనుషులు ఒక్కటే అనుకుంటే అప్పుడు నీ సమస్య పరిష్కారం అవుతుందని ఉపదేశించాడు. అంతేనా కె.రాఘవేంద్రరావు సినిమాలో నటించే అవకాశం ఇచ్చారే కానీ, నాకు వేదికలపై ఎలా మాట్లాడాలో నేర్పలేదని చలోక్తి విసిరాడు వెంకీ. శభాష్ వెంకీ..