Begin typing your search above and press return to search.

అల్లుడిపై మామ పొగ‌డ్త మామూలుగా లేదే

By:  Tupaki Desk   |   7 Dec 2019 4:43 PM GMT
అల్లుడిపై మామ పొగ‌డ్త మామూలుగా లేదే
X
లాభ న‌ష్టాలనే లెక్క‌లు వేసుకోకుండా మామా అల్లుళ్ల‌ను క‌లిపి సినిమా చేశామ‌ని అంటున్నారు డి.సురేష్ బాబు. చైతూ- వెంక‌టేష్ రియ‌ల్ మామా అల్లుళ్లు కావ‌డంతో వెంకీమామ‌పై జ‌నాల్లో ఆస‌క్తి నెల‌కొంది. గ‌త కొంత‌కాలంగా వెంకీమామ‌ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. అందుకు త‌గ్గ‌ట్టే సినిమా వుండ‌బోతోంద‌ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ముంద‌స్తు ఫీల‌ర్లు వ‌దిలింది. `వెంకీమామ` ప్రీరిలీజ్ ఈ వెంట్ సాక్షిగా వెంకీ ఎమోష‌న్ అయిన తీరు.. మామ‌పై చైతూ ఎమోష‌న్ చూస్తుంటే ద‌గ్గుబాటి- అక్కినేని హీరోలు దీనిపై చాలా న‌మ్మ‌క‌మే పెట్టుకున్నారో అర్థ‌మ‌వుతోంది.

ఇదే వేదిక‌పై మేన‌ల్లుడి న‌ట‌న‌కు ముగ్ధుడైపోయిన వెంకీ చై న‌ట‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. చైతూ ఈ చిత్రంలో చించేశాడు. ఒక మామ‌గా ఇంత‌కంటే ఇంకేంకావాలి. చాలా గ‌ర్వంగా వుంది.. అని అన్నారు. ముందు నుంచే అ సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్‌తో వున్నాం. మేము అనుకున్న‌ట్టే సినిమా కూడా బాగా వ‌చ్చింది. మంచి క‌థ‌ని సిద్ధం చేసుకుని అంద‌రం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. పెద్ద సినిమా సూప‌ర్‌ హిట్ ఇవ్వ‌బోతున్నాం అని అన్నారు వెంకీ.

ద‌ర్శ‌కుడు బాబి ఎంతో క‌ష్టప‌డ్డాడు. మామా అల్లుళ్ల సెంటిమెంట్ ని చాలా అద్భుతంగా తెర‌పైకి తీసుకొచ్చాడు. ఇంత మంచి చిత్రాన్నిచ్చినందుకు త‌న‌కు థాంక్స్... త‌ప్ప‌నిస‌రిగా విజ‌యం సాధిస్తాం!! అని సినిమాపై త‌న‌కున్న కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో వుందో వెంకీ చెప్ప‌క‌నే చెప్పారు.