Begin typing your search above and press return to search.
వెంకీ సన్మాన కార్యక్రమం
By: Tupaki Desk | 24 July 2016 9:48 AM GMTకథానాయకుడిగా వెంకటేష్ ప్రయాణం మొదలై ముప్పయ్యేళ్లయింది. ఆయన తొలి చిత్రం కలియుగ పాండవులు 1986 ఆగస్టు 14న విడుదలైంది. సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో వెంకీ 70కిపైగా సినిమాలు చేశారు. అటు మాస్ తో పాటు - ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌లోనూ అభిమానాన్ని సంపాదించాడు. వెంకీ ప్రయాణంలో ఎన్నెన్నో ప్రయోగాలు. దర్శకుల కథానాయకుడు అని పేరు తెచ్చుకొన్నాడు. అనుకోకుండానే - అసలెవరూ ఊహించని రీతిలో తెరపైకి అడుగుపెట్టిన వెంకటేష్ అంచలంచెలుగా అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. తన మూడు దశాబ్దాల ప్రయాణాన్ని పురస్కరించుకొని తన దర్శకులని సన్మానించాలని నిర్ణయించుకొన్నాడు. అందుకు బాబు బంగారం ఆడియో వేడుకని వేదికగా చేసుకొన్నాడు.
ఈ రోజు సాయంత్రమే శిల్పకళావేదికలో బాబు బంగారం ఆడియో వేడుక జరగబోతోంది. అందులోనే తనతో సినిమాలు తీసిన దర్శకులందరినీ సన్మానించబోతున్నాడు వెంకీ. కె.విశ్వనాథ్ - కె.రాఘవేంద్రరావు - కోదండరామిరెడ్డి - కోడి రామకృష్ణ - ముత్యాల సుబ్బయ్య - వి.వి.వినాయక్ - విజయ్ భాస్కర్ - గౌతమ్ మీనన్... ఇలా ఎంతోమంది దర్శకులతో కలిసి పనిచేశాడు వెంకీ. ఒకొక్కరు ఆయన్ని ఒక్కో తరహాలో తెరపై ప్రజెంట్ చేశారు. వాళ్లందరినీ సత్కరించుకోవాలనే వెంకీ ఆలోచన గొప్పదే. మరి ఈ వేడుకకి ఎంతమంది దర్శకులు వస్తారనేది చూడాలి. నయనతారతో కలిసి వెంకీ నటించిన చిత్రాన్ని మారుతి తెరకెక్కించారు. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.