Begin typing your search above and press return to search.

ఆడ‌పిల్ల‌ల‌కు గుండె ధైర్యం పెంచే వీడియో

By:  Tupaki Desk   |   29 Oct 2015 5:17 AM GMT


కంటే కూతుర్నే క‌నాలి. కొడుకుల వ‌ల్ల ఒరిగేదేంటి? కూతురైతే తండ్రిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది.. ఇలాంటి మాట‌ల్ని రెగ్యుల‌ర్‌ గా వింటుంటాం. క‌లికాలంలో కొడుకులు క‌న్న‌వారిపాలిట దుష్ట‌త్వం చూపిస్తుంటే కూతుళ్లు అలా కాకుండా క‌న్న‌వారిని అక్కున చేర్చుకుని బాగా చూసుకుంటున్నారు. అందుకే ఇలాంటివ‌న్నీ బైటికొస్తున్నాయి. ఏదైతేనేం ఇదే మాట‌ను కాస్త అటూ ఇటూగా హీరో వెంక‌టేష్ కూడా ఖ‌రారు చేశాడు.

మ‌హిళా ప్రేక్ష‌కుల నుంచి విశేష ఆద‌ర‌ణ పొందుతున్న విక్ట‌రీ వెంక‌టేష్ ల‌క్ష్మి - తుల‌సి వంటి సినిమాల‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇటీవ‌లే ఆన్‌ లైన్‌ లో ఓ వీడియో చూసి చ‌లించిపోయిన వెంకీ ఆ వీడియోని వ్య‌క్తిగ‌తంగా ఆన్‌ లైన్‌ లో ప్ర‌మోట్ చేస్తున్నాడు. ప్ర‌ముఖ నేప‌థ్య గాయ‌కుడు, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో త‌న కుమార్తె ష‌ర్మిల‌తో క‌లిసి ఆల‌పించిన ఐ నాన్న ఫ్లై అనే వీడియో గీతం త‌న‌కి విప‌రీతంగా న‌చ్చేసింద‌ని అన్నాడు.

ఆడ‌పిల్ల‌ల్లో ఆత్మ స్త్వ‌యిర్యాన్ని పంచే గీత‌మిది. ఇలాంటి గీతాన్ని అంద‌రూ చూడాలి అంటూ ఆ వీడియోని ప్ర‌మోట్ చేశాడు వెంకీ. అమ్మాయిల‌కు కొండంత దైర్యాన్ని ఇచ్చే పాట ఇది అని చెప్పాడు. మీరు కూడా చూసేయండి ఈ వీడియో...