Begin typing your search above and press return to search.

అల్లుడి పోర్షన్‌ పెంచమన్న వెంకీమామ

By:  Tupaki Desk   |   9 Dec 2019 8:34 AM GMT
అల్లుడి పోర్షన్‌ పెంచమన్న వెంకీమామ
X
వెంకటేష్‌.. నాగచైతన్య కలిసి నటించిన 'వెంకీమామ' విడుదలకు సిద్దం అయ్యింది. గత ఏడాది కాలంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్కినేని మరియు దగ్గుబాటి ఫ్యాన్స్‌ సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఈ కాంబో ఎట్టకేలకు రెడీ అయ్యి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి కనిపిస్తుంది. మామ అల్లుడు కలిసి నటించడంతో పాటు పోస్టర్స్‌ మరియు టీజర్‌ లు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

సినిమా విడుదల సమీపిస్తున్న సమయంలో ఒక ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో దర్శకుడు బాబీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదట తాను అనుకున్న కథలో మామ పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది.. అల్లుడు పాత్రకు కాస్త తక్కువ ప్రాముఖ్యత ఉంటుందట. మొదట ఈ కథను వెంకటేష్‌ గారికి చెప్పిన సమయంలో ఆయన చైతూ పాత్రను ఎందుకు తగ్గించి చెప్పావంటూ నన్ను ప్రశ్నించాడు. అప్పుడు స్క్రిప్ట్‌ ఇంకా బ్యాలన్స్‌ ఉందని అన్నాడట. అప్పుడు వెంకటేష్‌ తన మేనల్లుడి పాత్ర ఎక్కువ ఉండేలా కొన్ని సలహాలు ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

నాగచైతన్య ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకుని చేశాడు. ఈ సినిమా తర్వాత తన పారితోషికం పెంచేయాలని కూడా చైతూ ఎదురు చూస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల సినిమాను చూసిన చైతూ దర్శకుడిని హగ్‌ చేసుకుని చాలా బాగుందన్నాడట. ఇలాంటి సినిమాను ఇచ్చినందుకు కృతజ్ఞతలు అన్నాడట. ఈ సినిమాను సురేష్‌ బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించాడు. రాశిఖన్నా మరియు పాయల్‌ రాజ్‌ పూత్‌ లు హీరోయిన్స్‌ గా నటించారు.