Begin typing your search above and press return to search.
ఆ కథలో వెంకీ వైఫ్ సెట్ అవ్వట్లే?
By: Tupaki Desk | 30 Dec 2017 12:30 PM GMTస్టార్ హీరో ఇమేజ్ వస్తే టాలీవుడ్ హీరోలు కొన్ని ప్రయోగాలకు చాలా దూరం ఉండడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకు కారణాలు చాలానే ఉంటాయి. అభిమానులకు నచ్చకపోవచ్చు అనే అనుమానంతో ప్రయోగాలకు దూరంగా ఉంటారు. కానీ విక్టరీ వెంకటేష్ మాత్రం తన కెరీర్ ఎలాంటి లెవెల్లో ఉన్నా వినూత్న కథలకు ఓటేస్తాడు. అవసరం అయితే తన వయసుకు దగ్గరగా ఉండే పాత్రలను కూడా చేస్తుంటాడు.
గతంలో దృశ్యం - గోపాల గోపాల సినిమాలలో పిల్లలకు తండ్రిగా కనిపించి మంచి నటనతో ఆకట్టుకున్నాడు. కథ బావుంటే క్యారెక్టర్ ఎలాంటిదైనా ఓకె అనే ఆలోచనతో వెంకీ సినిమాలను చేస్తున్నాడు. నెక్స్ట్ కథలో కూడా వెంకీ అదే తరహా పాత్రను చేయబోతున్నాడట. తేజ దర్శకత్వంలో ఈ హీరో ఒక సినిమాను ఒకే చేసిన సంగతి తెలిసిందే. త్వరలో ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే ఈ సినిమాలో వెంకటేష్ ఇద్దరు పిల్లలకు తండ్రిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి అయ్యాయి.
కానీ ఒక్క హీరోయిన్ విషయంలో మాత్రం దర్శకుడు ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. కాజల్ ని అనుకున్నా కూడా ఆమె రెమ్యూనరేషన్ తక్కువ అఫర్ చేయడం వల్ల ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. అయితే నిజానికి అసలు కారణం అది కాదట. ఆమె కోలీవుడ్ లో బిజీగా ఉండడం వల్ల డేట్స్ ఇవ్వడం కుదరలేదు. ఇక తమన్నా - త్రిషా లాంటి వారిని అనుకున్నా కూడా వారు అందుకు సెట్ అయ్యే విధంగా లేరని వద్దనుకున్నారట. ఫైనల్ గా కొత్త హీరోయిన్ అయితే బెటర్ అని తేజ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి వెంకీ భార్యగా ఇద్దరి పిల్లలకు తల్లిగా ఎవరు నటిస్తారో చూడాలి.