Begin typing your search above and press return to search.
బాలీవుడ్ మల్టీస్టారర్ లో వెంకీ
By: Tupaki Desk | 8 April 2017 11:17 AM GMTవెంకటేష్ లేటెస్ట్ మూవీ గురు సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. రిలీజ్ రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. వీక్ డేస్ లో కూడా మంచి వసూళ్లు అందుకుంది. మధ్యలో శ్రీరామనవమి సెలవు రావడం బాగా కలిసొచ్చింది. రెండో వారాంతంలో కూడా మంచి వసూళ్లు వసూలు చేస్తుండడంతో.. ఇప్పటికే సేఫ్ అయిపోయిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు మంచి లాభాలు అందుకోనుంది.
తొలిసారిగా ఏజ్డ్ కేరక్టర్ మాత్రమే చేసిన మూవీ గురు సక్సెస్ కావడాన్ని.. వెంకటేష్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈపాటికే వెంకీ నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా కన్ఫాం కావాల్సింది కానీ.. అనుకున్న రెండూ ఆగిపోయాయి. కిషోర్ తిరుమలతో ఆడాళ్లూ మీకు జోహార్లు.. పూరీ జగన్నాధ్ తో జన గణ మన ప్రాజెక్టులు ఖాయమే అనుకున్నా.. అవి పట్టాలెక్కలేదు. ప్రస్తుతం రిలాక్సెడ్ మూడ్ లో ఉన్న వెంకీ.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి కొత్త కబురు చెప్పాడు.
ఇప్పటికిప్పుడు ఏ సినిమా మొదలుపెట్టేయకపోయినా.. సల్మాన్ ఖాన్ తో ఓ మల్టీ స్టారర్ చేసే ఆలోచన ఉందన్నాడు విక్టరీ వెంకటేష్. అలాగని ఇప్పటికే పనులు జరిగిపోతున్న ప్రాజెక్టేమీ కాదు. జస్ట్ మాటవరసకు అనుకుని.. ఆ ఆలోచనను వెంకీ పంచుకున్నాడంతే. ఇది వర్కవుట్ అయితే మాత్రం.. బాలీవుడ్ వెంకీని చూసే ఛాన్స్ లభించనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/